APSRTC | AP | Encounter | Tamilnadu

Chittur sheshachalam encounter effected on apsrtc

chuittur, encounter, tamilnadu, apsrtc, loss, ap, police,

Chittur sheshachalam encounter effected on apsrtc. Apsrtc carry 1.80 crore from april7 of this month. Tamilnadu protests the andhra vehicles in the tamilnadu state. apsrtc dismiss the bus services to tamilnadu from april7.

ఎన్ కౌంటర్ దెబ్బకు ఎపియస్ఆర్టీసీ అబ్బా.. 1.80 కోట్ల నష్టం

Posted: 04/17/2015 09:07 AM IST
Chittur sheshachalam encounter effected on apsrtc

చిత్తూర్ జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్లో తమిళనాడుకు చెందిన 20 మంది చనిపోయారు. అయితే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుండగా తప్పనిసరి పరిస్థితిలో ఎన్ కౌంటర్ జరపాల్సి వచ్చిందని ఏపి పోలీసులు వెల్లడించారు. కానీ తమిళనాడులో మాత్రం తమ వారిని చంపారంటూ ఆందోళనలు కొనసాగతున్నాయి. అలా తమిళనాడు వ్యాప్తంగా సాగుతున్న నిరసన ఫలితంగా ఏపియస్ ఆర్టీసీకి తీవ్ర నష్టం కలుగుతోంది. ముందే ఆర్టీసీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతుంటే చిత్తూర్ ఎన్ కౌంటర్ కారణంగా మరింత నష్టం వాటిల్లుతోంది. గత వారం రోజులు పైగా చిత్తూర్ నుండి తమిళనాడుకు పూర్తిగా రవాణా నిలిచిపోయింది. పైగా తిరుమల తిరుపతి వచ్చే వారు కూడా తగ్గి పోయారు. వచ్చిన వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలా రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిరగడం లేదు. తమిళనాడుకు చెందిన ఆందోళనకారులు ఆంధ్రాకు చెందిన వాహనాలు కనిపిస్తే చాలు దాడులకు దిగుతున్నారు. దాంతో ఆర్టీసీ బస్సులను నిలిపివేసింది ఎపియస్ఆర్టీసీ. పూర్తి స్థాయి రక్షణ కనిపిస్తేనే బస్సులను కదిలిస్తామని కూడా ఎపియస్ఆర్టీసీ వెల్లడించింది. అయితే అలా ఎన్ కౌంటర్ ఫలితంగా బస్సులు నిలిచిపోయి, 1.80కోట్ల రూపాయల మేర నష్టం కలిగి ఉందని తేలింది. మొత్తానికి ఏపియస్ఆర్టీసీకి ఎన్ కౌంటర్ దెబ్బబాగానే తగిలింది. మరి ఇంకా ఎన్ని రోజుల వరకు ఈ పరిస్థితి కొనసాగుతుదో.. ఎపియస్ఆర్టీసీకి ఇంకెన్ని నష్టాలు వస్తాయో.

- అభినవచారి 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chuittur  encounter  tamilnadu  apsrtc  loss  ap  police  

Other Articles