Revanth reddy | KCR | Promises | Te;angana

Revanth reddy fire on kcr for his promises to telangana people

Revanth reddy, kcr, telangana, palamoor, lift irrigation, medak, double bedroom, tdp

Revanth reddy fire on kcr for his promises to telangana people. The telangana cm kcr forgot the palamooru irrigation project and he his doing formhouse lift irrigation in medak.

కెసిఆర్ ఫాంహౌజ్ లో ఎత్తిపోతలు బాగా సాగుతున్నాయి

Posted: 04/17/2015 08:48 AM IST
Revanth reddy fire on kcr for his promises to telangana people

టిడిపిఎల్పీ నేత రేవంత్ రెడ్డి మాటలు చాలా చిత్రంగానూ, ఆసక్తికరంగానూ ఉంటాయి. అధికార పక్షంపై ఆయన చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ వార్తల్లో ప్రధానాంశాలుగా మారుతుంటాయి. తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మగాడు కూడా లేడని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. ఎవరైనా మగాడు ఉన్నాడంటే అతను టీడీపీ నుంచి వెళ్లిన వారేనని ఎద్దేవా చేశారు. . పాలమూరు ఎత్తిపోతల పథకం ఇప్పట్లో పూర్తయ్యేటట్టు లేదని, కానీ కేసీఆర్ ఫాంహౌస్‌లో ఎత్తిపోతలు బాగా కొనసాగుతున్నాయని విమర్శించారు. పేదలకు డబుల్ బెడ్‌రూమ్, దళితులకు మూడెకరాల స్థలం కేటాయింపు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్, కేజీ టూ పీజీ ఉచిత విద్య, ఉద్యోగాలు అంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలకు నష్ట పరిహారం నేటివరకు అందించలేదన్నారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిన కేసీఆర్.. దమ్ముంటే తన పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై అసెంబ్లీలో విమర్శలు చేసి, తర్వాత అసెంబ్లీ సమావేశాల నుండి బహిష్కరణకు గురైన రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలకు మరింత పదును పెట్టారు. కానీ మీడియా వాళ్లే రేవంత్ వ్యాఖ్యలను అసలు పట్టించుకోవడం లేదని కూడా కొంత మంది అనుకుంటున్నారట. పాపం.. అంత కష్టపడి రేవంత్ ప్రాసతో తిట్టినా పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరమే.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth reddy  kcr  telangana  palamoor  lift irrigation  medak  double bedroom  tdp  

Other Articles