ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు నిజాయితీగా కడితేనే ప్రభుత్వం అనుకున్న విధంగా పనులు చెయ్యగలుగుతుంది. కానీ కొంత మంది మాత్రం పన్నులు ఎగ్గొట్టి దర్జాగా బయట తిరుగుతున్నారు. అయితే పన్ను ఎగవేతదారులను ప్రభుత్వం మరోసారి రచ్చకీడ్చింది. కోట్లాది రూపాయల మేర పన్నులు ఎగవేసిన మరో 31 మంది డిఫాల్టర్ల పేర్లను ఆదాయం పన్ను శాఖ బహిరంగంగా ప్రకటించింది. ఈ 31 మంది పన్ను బకాయిల మొత్తం 1,500 కోట్ల రూపాయలు. డిఫాల్టర్లలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు, 10 సంస్థలున్నాయి. ఈ 13 మంది డిఫాల్టర్లు ఎగవేసిన మొత్తం 875.42 కోట్ల రూపాయలుంది. విశాఖపట్నం సంస్థ ఎండిఎల్ టెక్నాలజీస్ 11 కోట్ల రూపాయల బకాయితో జాబితాలో చోటుచేసుకుంది. మొత్తం 31 మంది డిఫాల్టర్లలో హైదరాబాద్ కంపెనీ టోటెమ్ ఇన్ఫ్రా అత్యధికంగా 401.64 కోట్ల ఆదాయం పన్ను శాఖకు బాకీ పడింది. ఆ తర్వాత స్థానంలో పుణె సంస్థ పతేజా బ్రదర్స్ ఫోర్జింగ్ అండ్ ఆటో పార్ట్స్.224.05 కోట్లు, మరో హైదరాబాద్ కంపెనీ రాయల్ ఫ్యాబ్రిక్స్ 158.94 కోట్లు ఉన్నాయి. జాబితాలో పేర్కొన్న సంస్థలు, వ్యక్తులు వెంటనే పన్ను బకాయిలను చెల్లించాలని ఐటి శాఖ సూచించింది.
డిఫాల్టర్లలో కొందరి ఆచూకీ లేదని మరికొందరి విషయంలో రికవరీకి తగినన్ని ఆస్తులు లేవని ఐటి శాఖ తన జాబితాలో పేర్కొంది. ఏళ్లుగా పన్నులు చెల్లించకుండా ఆదాయం పన్ను శాఖను ఇబ్బందులు పెడుతున్న వారి పేర్లను రచ్చకెక్కించడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండో సారి. కోట్ల రూపాయల పన్ను ఎగవేసిన సంస్థలు, వ్యక్తులు కూడా వారి బాగోతం గుట్టుగా ఉండటం వల్ల, సమాజంలో దర్జాగా చలామణి అవుతున్నారు. ఈ నేపథ్యంలో పేర్లను పబ్లిక్‌లో పెడితే సిగ్గుపడైనా బకాయిలు కడతారన్న ఊహతో ఐటి శాఖ జాబితాల ప్రచురణ మొదలుపెట్టింది. జాబితాల వల్ల ఆచూకీ లేకుండా పోయిన వారి గుట్టును సామాన్య ప్రజలు అందిస్తారన్న ఆశ కూడా ఐటి అధికారులకు ఉంది. ఇదివరకు ప్రకటించిన జాబితాలో మొత్తం 18 సంస్థలు, వ్యక్తులను డిఫాల్టర్లుగా పేర్కొన్నారు. వారి బకాయిల మొత్తం 500 కోట్ల రూపాయలు. తొలి జాబితాలో హైదరాబాద్ కంపెనీ డిజిటల్ పిసి టెక్నాలజీస్ ఉంది. సంస్థ బకాయి మొత్తం 35.02 కోట్ల రూపాయలు. మొత్తానికి పన్ను ఎగ్గొడంలో మేమూ ముందున్నామంటున్నామంటున్నారు హైదనాబాదీలు. అయితే పన్నును తొందరగా కట్టకపోతే కఠిన చర్యలు తప్పవు అని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయితే కనీసం ఇప్పటికైనా వీరు పన్ను కడతారో లేదో చూడాలి.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొన్ని కంపెనీలు.. ఎగ్గొట్టిన పన్ను వివరాలు..
టోటెమ్ ఇన్ ఫ్రా - 401.64 కోట్లు
రాయల్ ఫ్యాబ్రిక్స్ -158.94
కృషి వెంకటేశ్వరరావు -49.20
జెనెక్స్ టెక్నాలజీస్ -47.04
ఖాన్ గార్మెంట్స్ -46.56
నానో ఎక్సెల్ ఎంటర్ ప్రైజెస్-37.48
బీజీపురం ముకుంద్ రావ్-28.10
తక్షీల్ సొల్యూషన్స్- 27.35
జివిఎస్ ఇన్ ఫ్రా అండ్ ఇండస్ట్రీస్ -24.36
కెఆర్ఆర్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ -17.88
జక్కీ అబ్దుల్ హసన్ ఖాన్ -13.73
రాంక్లిన్ సొల్యూషన్స్ -12.14
ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ సర్వీస్ సీడ్స్ -11.00
ఎండిఎల్ టెక్నాలజీస్- 11.62 కోట్లు
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more