Highcourt | Repostmartum | Maniyamman | Encounter

High court order to repostmartum to maniyammans husband shashikumars body

Highcourt, encounter, shashikumar, justice, Chittur, Encounter, ap, tamilnadu, police, high court, murder, maniyamman,

high court order to repostmartum to maniyammans husband shashikumars body. The high court justice order to do one more time postmartum to shashikumars body. In the chittur encounter shashikumar is one of the dead on sandal smuggling.

రీపోస్టుమార్టం చెయ్యాలని హైకోర్టు ఆర్డర్

Posted: 04/16/2015 04:02 PM IST
High court order to repostmartum to maniyammans husband shashikumars body

చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై హైకోర్టు విచారణ చేసింది.  పోలీసులకు కోర్టు ఝలక్ ఇచ్చింది. రీ పోస్టుమార్టానికి కోర్టు అనుమతి లభించకపోవచ్చు అనుకున్న పోలీస్ అధికారులకు షాక్ ఇచ్చింది రాష్ట్ర హైకోర్ట్. ఎన్కౌంటర్లో చనిపోయిన శశికుమార్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. చెన్నైలో ఫోరెన్సిక్ నిపుణులైన డాక్టర్ల బృందంతో వీలైనంత త్వరగా రీ పోస్టుమార్టం ప్రక్రియను పూర్తిచేయాలని సూచించింది.  ప్రభుత్వ విచారణ పట్ల మృతుడు శశికుమార్ భార్య మునియమ్మళ్ అనుమానం వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ రోదిస్తూ న్యాయమూర్తిని ఆమె వేడుకున్నారు. అయితే.. శేషాచలం ఎన్కౌంటర్ మీద ప్రభుత్వ విచారణ పట్ల హైకోర్టు న్యాయమూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నివేదికను ఎందుకు సమర్పించలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. సుప్రీం కోర్టు నిబంధనలకు లోబడి మృతదేహాలకు వీడియోగ్రఫీతో పోస్టుమార్టం నిర్వహించామని ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పారు. అనంతరం శేషాచలం ఎన్కౌంటర్ కేసును విచారించిన కోర్టు రీ పోస్టుమార్టం చేయాలని ఆదేశించింది.

ఎన్ కౌంటర్‌కు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను, చనిపోయిన వ్యక్తుల శవపరీక్ష నివేదికలను సమర్పించాలని ఆంధ్ర ప్రదేశ్‌ సర్కార్‌ను గతంలోనే ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌పై విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేశామంటూ ఏపీ ప్రభుత్వం తెలియజేయడంతో సిట్‌ దర్యాప్తును తామే మాని టరింగ్‌ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. తన భర్త మృతదేహానికి మరోసారి పోస్టు మార్టం నిర్వహించాలని మణియమ్మన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమెను ప్రతివాదిగా చేర్చాలని, కేసు విచారణలో ఆమె వాదనను కూడా హైకోర్టు విన్నది. మణియమ్మన్ విన్నపాన్ని హైకోర్ట్ స్వీకరించి, ఆమె భర్త మృతదేహానికి రీపోస్టుమార్టం చెయ్యడానికి అనుమతి ఇచ్చింది. మరి చిత్తూర్ ఎన్ కౌంటర్ కేసులో ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో ముందు ముందు చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Highcourt  encounter  shashikumar  justice  Chittur  Encounter  ap  tamilnadu  police  high court  murder  maniyamman  

Other Articles