Suryapet | Court | Ponnam | Jagadeshwarreddy

Tention atpaspear at the premises of suryapet court on jagadeshwar reddy

suryapet, court, ponnam, jagadeshwarreddy, congress, trs, corruption

Tention atpaspear at the premises of suryapet court on jagadeshwar reddy, ponnam case. The court ajudge the case to june4. Congress mp ponnam prabhakar senteced on jagadeshwarreddys coruption.

సూర్యాపేటలో వేడెక్కిన వాతావరణం.. జగదీశ్వర్ రెడ్డి Vs పొన్నం ప్రభాకర్

Posted: 04/16/2015 03:51 PM IST
Tention atpaspear at the premises of suryapet court on jagadeshwar reddy

సూర్యాపేట లో వాతావరణం కాస్త వేడెక్కింది. వేడెక్కడం అంటే సూర్యుడి ప్రతాపాన్ని చూపించాడు అని అనుకుంటున్నారేమో.. ఇది అలాంటి వేడి కాదు రాజకీయ నాయకులు పుట్టించిన వేడి. మరి అంత తేలిగ్గా చల్లారుతుందా రాజకీయ నాయకులు మాట మాట పెరిగి చివరికి కోర్టు దాకా వెళ్లారు. ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదా కాస్తా.. రెండు పార్టీల నేతల మధ్య వివాదానికి దారి తీసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి అవినీతికి పాల్పడినట్లు నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సూర్యాపేట కోర్డుకు హాజరయ్యేందుకు వెళుతూ నల్లగొండ జిల్లా చిట్యాలలో గురువారం ఆయన ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు బూడిద బిక్షమయ్యగౌడ్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. ఇందుకోసం ప్రభుత్వం విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యపై అవినీతి ఆరోపణలు వచ్చీరాక మునుపే పదవి నుంచి సీఎం కేసీఆర్ అవమానకరంగా తొలగించారని పేర్కొన్నారు. అదే మంత్రి జగదీష్‌రెడ్డి అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తామని తాము సవాలు విసురుతుంటే ఆ మంత్రి ఇంట్లో సీఎం విందుకు వెళ్లటం విడ్డూరమన్నారు. జగదీష్‌రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని నిరూపించుకునేందుకు బదులు సూర్యాపేట కోర్డులో కేసు వేయటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి వాటికి తాను భయపడబోనని స్పష్టం చేశారు.

పరువు నష్టం కేసులో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సూర్యాపేట ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. మంత్రి జగదీశ్‌రెడ్డి అవినీతికి పాల్పడినట్లు పొన్నం చేసిన ఆరోపణలు  విషయం విదితమే. దీనిపై మంత్రి ఫిబ్రవరి 24వ తేదీన సూర్యాపేట ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. అయితే, న్యాయమూర్తి ఈ కేసును జూన్ 3వ తేదీకి వాయిదా వేశారు. అయితే సూర్యాపేట కోర్టు తీర్పు ఎలా వస్తుందో అని అటు టిఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ నాయకులలో టెన్షన్ వాతావరణం నెలకొని ఉండింది. రెండు పార్టీలకు చెందిన నాయకులు భారీగా వచ్చి చేరడంతో కాస్త పోలీసులకు టెన్షన్ వాతావరణం కనిపించింది. ముందు జాగ్రత్తగా సెక్షన్ 144 ను కూడా పోలీసులు విధించారు. ఎలాంటి ర్యాలీలు నిర్వహించడానికి పోలీసులు అనుమివ్వడం లేదు. మొత్తానికి వాతావరణం గత వారం నుండి చల్లబడింది అనుకుంటే సూర్యాపేటలో మాత్రం అందరికి కాక పెంచింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : suryapet  court  ponnam  jagadeshwarreddy  congress  trs  corruption  

Other Articles