Modi | Canada | Skillindia | Scamindia

Pm modi said our govt trying to scam india to skill india

Pm modi, NDA, canada, Toranto, Ricoh Coliseum, scams, skills, youth

Pm modi said Our govt. trying to scam india to skill india: Addressing the Indian diaspora at Ricoh Coliseum in Toronto, Prime Minister Narendra Modi said that a new "atmosphere of trust" has developed in India since he took over 10 months ago.

ITEMVIDEOS:స్కాం ఇండియా నుండి స్కిల్ ఇండియాగా మారుతోంది: మోదీ

Posted: 04/16/2015 10:19 AM IST
Pm modi said our govt trying to scam india to skill india

అసలే మాటల మరాఠీ మన ప్రధాని నరేంద్ర మోదీ.. మరి విదేశీగడ్డ మీద ఉన్న ఎన్ఆర్ఐలను తన మాటల గారడీతో కట్టేస్తున్నారు. కెనడా పర్యనటలో ఉన్న ప్రధాని ప్రసంగం అక్కడి వారి చేత చప్పట్లు కొట్టించింది.. అంతేనా వారి చేత ఈలలు వేయించారు. టొరెంటోలో రికో కోలీజియం ప్యాలెస్లో భారతీయులనుద్దేశించి  ప్రధాని   హిందీలో ప్రసంగించారు. కొత్త  ఆకాంక్షలతో, ఆశలతో తాను కెనడా వచ్చానన్నారు. కెనడాతో భారత్  మంచి సంబంధాలను కలిగి ఉందని ఇకముందు  కూడా ఈ సంప్రదాయం కొనసాగుతుందంటూ వారికి అభినందనలు తెలిపారు.

''2006లో అమెరికా, బ్రిటన్ నాకు వీసా ఇచ్చేందుకు నిరాకరిస్తే కెనడా మాత్రం నాకు వీసా ఇచ్చింది. 2003 నుంచి గుజరాత్ అభివృద్ధిలో కెనడా సహకరించింది. గతంలో కెనడాలో నేను పర్యటించినప్పుడు నేనెవరో తెలియదు. చాలాకాలంగా కెనడాతో భారత్‌కు సత్సంబంధాలున్నాయి. ఈ సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయి. కెనడా ప్రజలు భారత్‌ను గౌరవిస్తారు అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పనిలో పనిగా యుపిపై మండిపడ్డారు. స్కిల్ ఇండియాపైనే తమ దృఫ్టి తప్ప స్కామ్ ఇండియాపై కాదన్నారు. వారు మురికి చేసిపోతే తమ ప్రభుత్వం ఆ మురికిని శుభ్రం  చేయడానికి పూనుకుందన్నారు. స్వచ్ఛభారత్ ద్వారా భారత్‌ను పరిశుభ్రంగా ఉంచాలని సంకల్పించామని  మోడీ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని యువసంపద భారతదేశంలో ఉందన్నారు. దేశాభివృద్ధిలో కీలకమైన 80 కోట్ల మంది యువత  కలలు, 160 కోట్ల బలమైన చేతులు దేశానికి అండగా ఉన్నాయి. ఒక దేశ అభివృద్ధికి ఇంతకంటే ఏం కావాలన్నారు.  దేశంలోని యువత ఉద్యోగార్థులుగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించేవారుగా తయారు కావాలని కోరుకుంటున్నానన్నారు. 2030 తర్వాత ప్రపంచానికి అవసరమైన కార్మికశక్తి మన వద్ద ఉంటుందన్నారు.

* కెనడా, ఇండియా కలిస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఊహించండి
* డర్టీ పాలిటిక్స్ చేసిన కొన్ని ప్రభుత్వాలు వెళ్లిపోయాయి. ఇక మా ప్రభుత్వం వాటన్నింటిని శుభ్రం చేస్తోంది.
* ఇండియాకు స్కాం ఇండియా అనే పేరు ఉంది కానీ స్కిల్ ఇండియాగా మార్చాలని మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
* 2030 నాటికి శ్రామిక శక్తి ఎంతో కావాలి. అది కేవలం ఇండియా నుండి మాత్రమే వస్తుంది.
* 80 కోట్ల యువ జనాభా, 80 కోట్ల కలలు, 160 కోట్ల చేతులు.. ఇవి ఏ లక్ష్యాన్ని సాధించకుండా ఉంటాయి చెప్పండి.
* మా మార్స్ మిషన్ ఓ హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువే

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pm modi  NDA  canada  Toranto  Ricoh Coliseum  scams  skills  youth  

Other Articles