Telanagana | Wifi | Free | Hussainsagar

Telangana govt propose to porvide free wifi services at hussain sagar premises

Telanagana, wifi, free, Hussain sagar, madhapur, hitechcity, kondapur, bsnl, ktr, kcr

telangana govt propose to porvide free wifi services at hussain sagar premises. The telangana It minister k.tarakaramarao will launch the free wifi facility at mariyat hotel, hyderabad.

ఫ్రీ వైఫై.. హుస్సేన్ సాగర్ చుట్టు పది కిలోమీటర్ల వరకు సేవలు

Posted: 04/16/2015 07:50 AM IST
Telangana govt propose to porvide free wifi services at hussain sagar premises

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ను వైఫై నగరంగా మార్చేందుకు ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఇప్పటికే హైటెక్ సిటి, మాదాపూర్, కొండాపూర్ లలో కొన్ని ప్రాంతాల్లో వైఫై సౌకర్యాన్ని కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది తెలంగాణ ఐటి శాఖ.  నేటి నుండి నగరవాసులకు ఉచిత వైఫై సేవలు అందించే కార్యక్రమం ప్రారంభం కానుంది.  ప్రయోగాత్మకంగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టుతో హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో ఉచిత వైఫై సేవలు అందించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. హోటల్ మారియట్‌లో ఉచిత వైఫై పైలట్ ప్రాజెక్టును రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు లాంఛనంగా ప్రారంభించనున్నారు.

కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు తొలి వీడియో కాల్ చేసి కేటీఆర్ సంభాషించనున్నారు. ఈ ఉచిత వైఫై ప్రాజెక్టుకు బీఎస్‌ఎన్‌ఎల్, క్వాడ్‌జెన్ సంస్థలు సంయుక్తంగా సేవలు అందించనున్నాయి. పైలట్ ప్రాజెక్టులో భాగంగా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల సుమారు 10 కిలోమీటర్ల పరిధిలోని  వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయని, ఒకేసారి 2,500 మంది లాగిన్ కావచ్చని అధికారులు తెలిపారు.2 ఎంబీపీఎస్ నుంచి 20 ఎంబీపీఎస్ వేగంతో ఈ ఉచిత వైఫై సేవలు లభిస్తాయని, 30 నిమిషాలు ఉచితంగా ఈ సేవలు పొందవచ్చని వివరించారు. మొత్తానికి నగరాన్ని వైఫై నగరంగా మారుస్తామన్న తెలంగాణ సర్కార్ తన మాటను నిలబెట్టుకుంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telanagana  wifi  free  Hussain sagar  madhapur  hitechcity  kondapur  bsnl  ktr  kcr  

Other Articles