Isis releases propaganda video warning America and Obama second 9-11

Isis releases propaganda video warning america and obama second 9 11

Isis propaganda video, isis warning America, 9/11-style attack, Obama news, isis attacks news, isis controversies, isis attacks, america attacks news, barack obama controversy

Isis releases propaganda video warning America and Obama second 9-11 : Isis has released a video which states there is now "no safety for any American on the globe'" and that there will be another 9/11-style attack against the US.

ITEMVIDEOS: ‘అమెరికాను తగలబెట్టి సర్వనాశనం చేస్తాం’

Posted: 04/14/2015 01:38 PM IST
Isis releases propaganda video warning america and obama second 9 11

గతకొన్నాళ్ల నుంచి మారణహోమాలు కొనసాగిస్తూ వస్తున్న అత్యంత భీకరమైన ఉగ్రవాద సంస్థ ISISకు, అమెరికా దేశానికి మధ్య భీబత్సకరమైన పోరాటాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే! ఈ క్రమంలోనే తాజాగా ISIS ఓ ఘాటైన సందేశంతో కూడిన వీడియోను విడుదల చేసింది. అందులో తాము అమెరికాను తగలబెట్టి సర్వనాశనం చేస్తామని.. ప్రపంచంలో అమెరికన్లు ఎక్కడున్నా వదిలిపెట్టబోమంటూ ఆ సంస్థ హెచ్చరించింది.

అంతేకాదు.. 9/11 దాడులను పునరావృతం చేస్తామని.. అప్పుడుకంటే ఈసారి చాలా భయంకరమైన దాడులు జరుగుతాయని ఆ వీడియోలో ISIS వెల్లడించింది. అమెరికన్ పౌరులను తమ నుంచి ఎవ్వరూ కాపాడలేరంటూ ఆ సంస్థ సవాలు విసిరింది. భౌగోళిక పరిస్థితులను నమ్ముకొన్ని అమెరికన్లు తమపై దాడులు జరగవని నమ్ముతున్నారని, ఆ నమ్మకం ఎంతోకాలం వుండదని సంస్థ తెలిపింది. ఇదిలావుండగా.. ఈ వీడియోలో లాడెన్ ను కీర్తిస్తూ ఒక పాట వినిపిస్తుండగా.. బాంబులను పేలుస్తున్న దృశ్యాలు కూడా వున్నాయి.

ISIS విడుదల చేసిన ఈ హెచ్చరిక వీడియో నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం.. ISIS రచించే ప్రతి కదలికను ముందుగానే పసిగట్టేందుకు అమెరికా వ్యూహాత్మక ప్రణాళికలు కొనసాగిస్తోందని అంతర్గతంగా వార్తలొస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : isis propaganda video  isis warning America  9/11-style attack  barack obama  

Other Articles