Balakrishna | Garlanding | Ambedkar | Hindupur

Dalith protestrs fire and protest at ambedkar statue on cinema actor hindupur mla balakrishna

balakrishna, garlanding, ambedkar, hindupur, highway

dalith protestrs fire and protest at ambedkar statue on cinema actor, hindupur mla balakrishna. The Balakrishna have to garlanding at ambedkar statue at national highway. But balakrishna pass from near but didnt galnd. So daliths protest aganist balakrishna.

బాలయ్యా.. ఇదేం బాగోలేదయ్యా..

Posted: 04/14/2015 01:18 PM IST
Dalith protestrs fire and protest at ambedkar statue on cinema actor hindupur mla balakrishna

పూల మాల వేస్తాడు అనుకున్న హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పూలమాల వెయ్యకుండా వెళ్లిపోయాడు. దాంతో బాలయ్య తిరిగి వచ్చి పూలమాల వెయ్యాలంటూ కొందరు ధర్నా నిర్వహించారు. అసలు పూలమాల ఏంటీ, ఈ ధర్నా ఏంటీ అనేగా అనుమానం. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డాక్డర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేయకుండా వెళ్లడంతో ఆగ్రహించిన దళితులు ధర్నాకు దిగారు. ఈ సంఘటన మంగళవారం హిందూపురం నియోజకవర్గం పరిధిలోని లేపాక్షిలో జరిగింది. నియోజకవర్గ పర్యటనలో భాగంగా పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బాలకృష్ణ లేపాక్షి మీదుగా హిందూపురం వెళ్లారు. లేపాక్షి జాతీయరహాదారిలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన జయంతి సందర్భంగా పూలమాలలతో అలంకరించారు.

లేపాక్షి మీదుగా హిందూపురం వెళ్తున్నబాలయ్య మార్గమధ్యలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేస్తారని చెప్పడంతో దళితులు ఆయన కోసం నిరిక్షించారు. అయితే, విగ్రహం పక్కనుంచే వెళ్లిన ఆయన ఆగకపోవడంతో ఆగ్రహించిన దళితులు అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నాకు దిగారు. బాలయ్య వెనక్కు వచ్చి పూలమాల వేసే వరకు ఆందోళనను విరమించేది లేదని వారు భీష్మించారు. విషయం తెలిసిన హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప లేపాక్షికి వచ్చి దళితులను సముదాయించి విగ్రహనికి పూలమాల వేసి వెళ్లారు. మొత్తానికి బాలయ్య బాబుపై మాత్రం దళితులు అసంతృప్తితోనే వెనుదిరిగారు. బాలయ్య బాబు పద్దతి ఏం బాగోదని విమర్శిస్తు అక్కడి నుండి ఇళ్ల వెళ్లిపోయారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  garlanding  ambedkar  hindupur  highway  

Other Articles