Mumbai | Attacks | Terrorists | IB

Intelligence warned to mumbai attacks by terrorists

Intelligence, IB, India, mumbai, terrorists, attacks, pakistan, karachi, yakub, maharastra

Intelligence warned to mumbai attacks by terrorists. The Intelligence officials gave warn to mumbai police, maharastra govt on terrorists attacks. Police alert on IB warning and providing security at all busy areas.

ముంబై పై ఉగ్రవాదుల దాడి..? .. హెచ్చరించిన నిఘా వ్యవస్థ

Posted: 04/14/2015 11:14 AM IST
Intelligence warned to mumbai attacks by terrorists

టెర్రరిస్టులు మరో సారి తమ పంజా విసరనున్నారా.  గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న ఉగ్రవాదులు ఇప్పుడు రెచ్చిపోతారా అంటే అవుననే సమాధానం వస్తుంది. అందునా ముంబైపై ఉగ్రవాదులు దాడి చెయ్యడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. గతంలో ఢిల్లీని టార్గెట్ గా చేసిన ఉగ్రవాదులు ఇప్పుడు ముంబైని టార్గెట్ గా చేశారని నిఘా వర్గాలు సామాచారాన్ని అందించాయి. ఈ సారి ఉగ్రవాదులు ప్రతీకార దాడులకు దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఇంటలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది.

ముంబైలోని అన్ని  రైల్వే స్టేషన్లకు టెర్రరిస్టు ముప్పు పొంచి ఉందనే సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.  నగరంలోకి సముద్ర మార్గం  ద్వారా  లష్కరే తాయిబా ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో  భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. దీనికి సంబంధించి సోమవారం స్టేట్ ఇంటెలిజెన్స్ విభాగం  హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబాకు చెందిన ఉగ్రవాదులు సుమారు 10 మంది  ముంబై రైల్వేస్టేషన్లను  టార్గెట్ చేశారనే సమాచారంతో ఈ అలర్ట్ జారీ చేశారు.  దీంతో 17 స్టేషన్లకు  ఆర్పీఎఫ్ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు.  ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీలను ముమ్మరం చేశారు.ప్రస్తుతం తప్పించుకుని తిరుగుతున్న యాకూబ్ పాకిస్తాన్లోని కరాచీ ద్వారా తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్టుగా  భద్రతా వర్గాలు తెలిపాయి. మరి పోలీసులు ఐబి హెచ్చరికలతో కట్టుదిట్టమైన భద్రతకు ఏర్పాట్లు చేస్తున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Intelligence  IB  India  mumbai  terrorists  attacks  pakistan  karachi  yakub  maharastra  

Other Articles