MAA | Elections | Court

Court ajudge the fianl judgement on maa election for day after tomarrow

rajendraprasad, jayasudha contest the maa elections at this time. maa, elections, artists, cinema, rajendraprasad, jayasudha,

court ajudge the fianl judgement on maa election for day after tomarrow. The Maa election did on march29. rajendraprasad, jayasudha contest the maa elections at this time.

సస్పెన్స్ సా.. గుతోంది.. ఎల్లుండి మా ఎన్నికల కేసు వాయిదా

Posted: 04/13/2015 04:18 PM IST
Court ajudge the fianl judgement on maa election for day after tomarrow

మా ఫలితాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రోజు కోర్టు తీర్పు ఖచ్చితంగా ఫలితాలు విడుదల చెయ్యలని వస్తుందని అందరూ అనుకున్నా.. కోర్ట్ మాత్రం ఫలితాలపై ఎలాంటి తీర్పును వెల్లడించలేదు. రెండు పక్షాల వాదనలు విన్నా కోర్టు తీర్పును ఎల్లుండికి వాయిదా వేసింది. ‘మా’ అధ్యక్ష ఎన్నికలు ఇటీవలే మార్చి 29వ జరిగిన విషయం తెలిసిందే.ఎన్నికలకు ముందు రసవత్తరంగా జరిగిన విషయం తెలిసిందే.  ‘మా’ అధ్యక్ష పదవి కోసం నటుడు రాజేంద్రప్రసాద్, నటి జయసుధలు పోటీలో నిలబడ్డారు. ఎన్నికలకు ముందు ఇరు వర్గాల వారు భారీగా మాటల యుద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

‘మా’ ఎన్నికల ఫలితాలు మొదటగా ఏప్రిల్ 7న విడుదల చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 9 అనుకున్నారు. కానీ చివరకు ఏప్రిల్ 13వ తేదికి ఖరారు చేసారు. కానీ ప్రస్తుతం దాన్ని కూడా కోర్టు అడ్డుకుంది. మరోసారి ఫలితాలపై సస్పెన్స్ కు తెర తీసింది. మొత్తానికి ఇవాళ వస్తుందని అనుకున్న ఫలితాలు రాకుండా.. కోర్టు ఆర్టిస్ట్ ల పల్స్ రేట్ ను పెంచేసింది. మరి ఎల్లుండి కోర్టు ఫలితాల విడుదలపై స్పష్టత ఇస్తుందేమో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles