Supremecourt | Living | Together

Supreme court announce that an unmarried couple tratde is living together as husband and wife

livingtogether, supremecourt, judgement, family,

supreme court announce that an unmarried couple tratde is living together as husband and wife: If an unmarried couple is living together as husband and wife, then they would be presumed to be legally married and the woman would be eligible to inherit the property after death of her partner, the Supreme Court has ruled.

సహజీవనాన్ని పెళ్లిగానే గుర్తిస్తాం: సుప్రీంకోర్ట్

Posted: 04/13/2015 11:47 AM IST
Supreme court announce that an unmarried couple tratde is living together as husband and wife

సహజీవనం.. ఇద్దరు ఆడ, మగ పెళ్లి కాకుండా సాగించే కాపురం. విదేశాల్లో ఎక్కువగా కనిపించే సహజీవన సంసృతి ఇప్పుడు మన దేశంలో ఎక్కువగా కనిపిస్తోంది. గత కొంత కాలంగా సెలబ్రెటీలు ఎక్కువగా ఇలాంటి సంసృతినే ఇష్టపడుతున్నారు. పెళ్లికి ముందు తమను నచ్చిన వ్యక్తితో కలిసి కొంత కాలం ఉండి, ఒకవేళ చేసుకోవాలి అనిపిస్తే పెళ్లి చేసుకోవడం లేదంటే వదిలెయ్యడం సహజీవనంలో జరిగే తంతు. అయితే సహజీవనం గురించి సుప్రీంకోర్ట్ మాత్రం కొత్త భాష్యం చెబుతోంది.

ఇద్దరు పెళ్లికాని వాళ్లు కలిసి కాపురం చేస్తుంటే వాళ్లను పెళ్లయినవాళ్లు గానే భావిస్తామని సుప్రీంకోర్ట్ వెల్లడించింది. సహజీవనం చేస్తున్న వారిలో మేల్ పార్ట్ నర్ చనిపోతే అతనికి చెందిన  ఆస్తికి సహజీవనం చేసిన మహిళ వారసురాలు అవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఒకవేళ అలా కాదు.. ఆస్తి ఇవ్వకూడదనుకుంటే, వాళ్లిద్దరికీ చట్టబద్ధంగా పెళ్లికాలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ మగవాడి తరఫు పార్టీమీదే ఉంటుందని స్పష్టం చేసింది. ఎక్కువ కాలం పాటు ఒక పురుషుడు, ఒక మహిళ కలిసి నివసిస్తుంటే దాన్ని పెళ్లిగానే చట్టం భావిస్తుందని జస్టిస్ ఎంవై ఇక్బాల్, జస్టిస్ అమితవ రాయ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక రూలింగ్లో తెలిపింది. 2010 నుంచి కూడా సుప్రీంకోర్టు సహజీవనం చేస్తున్న జంటలను భార్యాభర్తలుగానే పరిగణిస్తూ వారికి అనుకూలంగానే రూలింగులు ఇస్తోంది.

అయితే గతంలో మాత్రం సుప్రీంకోర్ట్ సహజీవనం కేసు విషయంలో ఆడ, మగ ఇద్దరు కలిసి కాపుర చేస్తూ ఉంటే వారిలో ఆడవారు కోర్టులను ఆశ్రయించినా వారిద్దరి బంధాన్ని సహజీవనంలా భావించలేమంటూ సుప్రీం ధర్మాసనం తేల్చింది. కానీ తాజాగా మాత్రం సహజీవనం గురించి కుండబద్దలు కొట్టింది. ఆస్తుల పంపకం విషయంలో సుప్రీం తీర్పు ఎంతో కీలకంగా మారనుంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : livingtogether  supremecourt  judgement  family  

Other Articles