netaji issue raised to side track land bill issue says hanmanthrao

Chandrababu hand in satyam scam says hanumantha rao

chandrababu hand in satyam scam, netaji issue raised to side track land bill issue, congress senior leader hanmantha rao, satyam scam, land bill, chandrababu, venkaiah naidu, venkaiah assets increaded, venkaiah daughter collections in the name of NGO,

netaji issue raised to side track land bill issue says hanmanthrao, and alleges chandrababu hand in satyam scam

ల్యాండ్ బిల్లుపై ప్రజల దృష్టిని మరల్చేందుకే నేతాజీ అంశం

Posted: 04/12/2015 07:29 PM IST
Chandrababu hand in satyam scam says hanumantha rao

దేశంలో మార్పులు తీసుకువస్తామని ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన బీజేపీ.. రైతులకు మేలు చేసే భూ సేకరణ బిల్లుకు చిల్లులు పెట్టి పెట్టుబడి దారులకు మేలు చేసేందుకు తీవ్రయంగా యత్నిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యభ సభ్యుడు వి హనుమంతరావు విమర్శించారు. దేశ వ్యాప్తంగా భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అన్నదాతలు అంశాన్ని పక్కదారి పట్టించేందుకు నేతాజీపై నెహ్రూ నిఘా పెట్టారంటూ బీజేపీ సర్కారు నాటకమాడుతోందని దుయ్యబట్టారు. నెహ్రూ హయాం ముగిసి దశాబ్దాలు గడుస్తున్నా.. ఈ అంశం ఇప్పటి వరకు ఎందకు బయటకు రాలేదని ఆయన ప్రశ్నించారు.

బీజేపికి చిత్తశుద్ధి ఉంటే మరణించిన నేతలపై కాకుండా సత్యం కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సత్యం కుంభకోణం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు హస్తం ఉందేమోనన్న అనుమానాలున్నాయని ఆయన ఆరోపించారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టాక వెంకయ్య నాయుడు ఆస్తులు పెరిగాయని వీహెచ్ ఆరోపించారు. స్వచ్ఛంద సంస్థ పేరుతో వెంకయ్యనాయుడు కుమార్తె భారీగా సంపాదిస్తున్నారని అన్నారు. ఎప్పటికైనా ఆయన కుటుంబ ఆస్తులపై విచారణ జరుగుతుందని చెప్పారు. భూసేకరణ ఆర్డినెన్స్ అంశంలో బీజేపీ ప్రభుత్వంపై రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : v. hanumantha rao  satyam scam  land bill  chandrababu  venkaiah naidu  

Other Articles