Wild Elephants attack on Crops in Vizianagaram District

Wild elephants destroy crops in vizianagaram district of andhra pradesh

Andhra Pradesh wild elephants, man-animal conflict, Wild Elephants attack on Crops in Vizianagaram, herd of wild elephants, makkuva mandal, heavy loss to farmers, villagers scared of elephnats, forest department officials,

A herd 18 elephants from nearby forests that crossed into vizianagaram district makkuva mandal, destroyed crops leaving heavy loss to farmers

గజగజలాడిస్తున్న గజరాజులు.. భీతుల్లుతున్న పురవాసులు

Posted: 04/11/2015 02:53 PM IST
Wild elephants destroy crops in vizianagaram district of andhra pradesh

విజయనగరం జిల్లాలో గజరాజులు పుర ప్రజలను గజగజలాడిస్తున్నాయి. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి గ్రామాల్లోకి చోచ్చుకువస్తున్న గజరాజులు.. మూకుమ్మడిగా పంట పోలాలపై దాడులకు తెగబడుతూ.. పంటలను పూర్తగా ధ్వంసం చేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఏనుగులు తమ పంటపోలాలను ధ్వంసం చేస్తున్నాయని.. బాధిత రైతన్నలు అవేదన వ్యక్తం చేశారు. తాజాగా జిల్లాలోని మక్కువ మండలం మూలవలసలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగులు పంటలను ధ్వంసం చేశాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

అడవులను మనుషులు చిద్రం చేస్తున్న క్రమంలో అభయారణ్యం నుంచి జనారణ్యంలోకి చోచ్చుకోస్తున్న గజరాజులు.. గ్రామ శివార్లతోని పంటపోలాలపైబడి బీభత్సం చేస్తున్నాయి. ఏనుగులు వల్ల గత మూడు రోజులుగా పంటను నష్టపోతున్నామని.. దీనిపై గత మూడు రోజులైనా అటవీశాఖాధికారులకు పిర్యాదు చేసినా.. పట్టించుకోక పోవటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనుగుల బీభత్సం వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇప్పించి, ఏనుగుల బెడదను నివారించాలని రైతులు కోరుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Wild Elephants  Crops  Vizianagaram  

Other Articles