Gujarat | Modi | Tourism

The gujarat tourism corporation has been introduce modi tourism

gujarat, tourism, modi, new plan, trip, india, visit, modism, tourism, launch, introduce, vaddnagar, vibrant gujarat

The Gujarat Tourism Corporation has been promoting an unusual tourism package for the last few weeks in various cities of the country. Named as 'Modi Tourism', this unique package will take you in and around Vadnagar- the birthplace of Prime Minister Narendra Modi in Gujarat.

చూడండి బాబూ.. చూడండి.. మోదీ గారి అది, ఇది

Posted: 04/08/2015 04:52 PM IST
The gujarat tourism corporation has been introduce modi tourism

గుజరాత్ వెళ్తున్నారా.. నరేంద్రమోదీ పుట్టిన ఇల్లు.. వారి పూర్వీకులు నివసించిన ప్రదేశం, మోదీ చిన్నప్పుడు టీ అమ్మిన రైల్వే స్టేషన్ చూడాలను కుంటున్నారా.. మీకు టూరిస్ట్ ప్యాక్ రెడీ.. కేవలం 600 రూపాయలు చెల్లిస్తే.. ఈ ప్రదేశాలు దర్శించవచ్చు. గుజరాత్ ప్రభుత్వ టూరిజం సంస్థ ఈ ప్రత్యేక ప్యాకేజీ ఆఫర్ చేస్తోంది. గుజరాత్ లోని మెహ్సానా జిల్లా వద్ నగర్ లో 1950లో మోదీ జన్మించారు. ఆ గ్రామం, మోదీ పూర్వీకుల ఇల్లు, రైల్వేస్టేషన్ లను టూరిజం కార్పొరేషన్ అఫ్ గుజరాత్ లిమిటెడ్ దర్శనీయస్థలాలుగా చేసింది. మోదీ అంటే క్రేజ్ ఉన్న గుజరాత్ లో ఈ ప్యాకేజీ సూపర్ హిట్ అయిందట. జనవరిలో అహ్మదాబాద్ లో జరిగిన వైబ్రాంట్ గుజరాత్ సభ సందర్భంగా ప్రవేశపెట్టిన వెబ్ సైట్ ద్వారా ఈ టూర్ ను ప్రమోట్ చేస్తున్నారు.

అహ్మదాబాద్, గాంధీనగర్ నుంచి టూర్ మొదలవుతుంది. వద్ నగర్ లో మొదట మోదీ జన్మించిన, వారి పూర్వీకుల ఇల్లు, మోదీ చదువుకున్న ప్రాథమిక పాఠశాల – ‘వద్ నగర్ ప్రాథమిక్ కుమార్ శాలా’ కు తీసుకువెళ్తారు. మోదీ చిన్నప్పుడు చదువుకుంటూనే నాటకాలు వేసిన వద్ నగర్ లోని హైస్కూల్ ను కూడా చూపిస్తారు. తర్వాత ప్రసిద్ధ హట్ కేశ్వర్ దేవాలయం సందర్శన. ఈ శివాలయంలోనే మోదీ భజనల సందర్భంగా తబ్లా వాయించేవారట. టూరిస్ట్ లు కోరిన పక్షంలో మోదీ చిన్ననాటి స్నేహితులతో కూడా మాట్లాడే అవకాశం కల్పిస్తారు. తర్వాత వద్ నగర్ రైల్వే స్టేషన్ సందర్శన. నేటి ప్రధాని ..ఒకప్పటి చాయ్ వాలా.. టీ అమ్మిన స్థలం ఇది. తన జీవితంలో ఈ ప్రదేశాన్ని ఎన్నడూ మరచిపోలేనని ప్రధాని మోదీ పదేపదే చెప్పేస్థలం ఇది. వద్ నగర్ లో ప్రాచీన బౌద్ధ ఆరామాలు, శర్మిష్ట సరస్సులను కూడా చివర్లో టూరిస్ట్ లు సందర్శించవచ్చు. శర్మిష్ట సరస్సులోనే మోదీ చిన్నప్పుడు సాహసించి మొసలిని పట్టుకున్నారని చెబుతారు. మొత్తానికి ప్రధాని మోదీ గురించి టూరిస్టులకు తెలిసి వచ్చేలా ప్రత్యేక ప్యాకేజీలను కూడా సిద్దం చేశారు. అలా మోదీ జీవిత చరిత్రను కొత్తగా ప్రమోట్ చేస్తున్నారని కొందరు అప్పుడే విమర్శలు కూడా గుప్పిస్తున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gujarat  tourism  modi  new plan  trip  india  visit  modism  tourism  launch  introduce  vaddnagar  vibrant gujarat  

Other Articles