Oppose Land Bill in RS, Jairam tells BJD | Land Act amendments | Mahabharata

Mahabharata will be fought over proposed land act amendments

Prime Minister, Narendra Modi, BJP, Bharatiya Janata Party, Union Minister, Jairam Ramesh, Telangana Chief Minister, K. Chandrasekhar Rao, ‘Mahabharata’, land acquisition Act amendments, farmers and tribals

Congress on Monday said another ‘Mahabharata’ would be fought over proposed amendments in the land acquisition Act in which parties like BJD must prove their commitments towards farmers and tribals.

ల్యాండ్ బిల్లు కోసం మరో మహాభారతం

Posted: 04/06/2015 10:50 PM IST
Mahabharata will be fought over proposed land act amendments

భూసేకరణ చట్టానికి సవరణల బిల్లును అడ్డుకునేందుకు అవసరమైతే మహాభారత యుద్ధం- 2015 చేయడానికి కూడా వెనుకాడబోమని కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దుర్యోధనుడిలా వ్యవహరిస్తూ.. రైతులు, గిరిజనుల నుంచి భూమిని గుంజుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో తాను గెలిచేందుకు డబ్బు సమకూర్చిన కార్పొరేట్ కంపెనీల రుణం తీర్చుకునేందుకే మోదీ భూ సేకరణ చట్టానికి సవరణలు చేపట్టారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీఏ- 2 హయాంలో రూపొందించిన భూ సేకరణ చట్టానికి ఎన్డీఏ సర్కార్ చేసిన సవరణలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించిందే.

దుర్యోధనుణ్ని ఓడించేందుకు పాండవుల మాదిరి పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీతో మిగతా పార్టీలూ కలిసిరావాలని జైరాం పిలుపునిచ్చారు. సోమవారం భువనేశ్వర్లో మీడియాతో మాట్లాడుతూ భూ సేకరణ సవరణల బిల్లును బీజేడీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వ్యతిరేకించాలన్నారు. కేంద్రం రూపొందించిన ఈ బిల్లును సమాజ్ వాదిపార్టీ, బీఎస్పీ, సీసీఎం, సీసీఐ, ఎన్సీపీ, జేడీ (యూ), టీఎంసీ, డీఎంకే పార్టీలు బాహాటంగా వ్యతిరేకించిన సంగతి గుర్తుచేస్తూ మిగతా పార్టీలు కూడా అదే నిర్ణయాన్ని ప్రకటించాలని కోరారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prime Minister  Narendra Modi  BJP  Bharatiya Janata Party  Union Minister  Jairam Ramesh  

Other Articles