Girls should not be given mobile phones, says BJP MLA Sunder Lal

Girls should not be given mobile phones says bjp mla sunder lal

Mobile phones spoiling girls, controversy comments, Pilani Assembly constituency MLA,, Rajasthan bjp MLA, Ambedkar Bhawan, BJP MLA, mobile phones, Sunder Lal, Girls, mobile phones, BJP MLA Sunder Lal, Jhunjhunu, Rajasthan

A BJP MLA Sundarlal stoked controversy on Monday by advising parents not to give their daughters mobile phones.

అమ్మాయిలు సెల్ఫోన్లుతో చెడిపోతున్నారు.. తల్లిదండ్రులూ జాగ్రత..

Posted: 04/06/2015 10:49 PM IST
Girls should not be given mobile phones says bjp mla sunder lal

అమ్మాయిలు సెల్ఫోన్లుతో చెడిపోతున్నారు.. తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత.. అంటూ ఓ బీజేపి ఎమ్మెల్యే హెచ్చరికలు చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎంపీలు, కేంద్రమంత్రుల తరువాత ఎమ్మెల్యేల వంత వచ్చిందని ఆయన అవకాశాన్ని పునికి పుచ్చుకుని వివాదాలు కోనితెచ్చుకున్నారు. తాజాగా రాజస్థాన్ లోని పిలానీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సుందర్ లాల్ అమ్మాయిలకు సెల్పోన్లు ఇవ్వొద్దంటూ వ్యాఖ్యానించారు. ఝుంఝునూలోని  అంబేద్కర్ భవన్లో జరిగిన  ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సుందరలాల్ ఆడపిల్లల తల్లిదండ్రలకు వివాదాస్పద సూచనలు చేశారు.

సెల్ఫోన్ వల్ల అమ్మాయల  జీవితాలు పాడైపోతాయి.. వారికి సెల్ఫోన్లు ఇవ్వద్దంటూ తల్లిదండ్రులకు సూచించారు.  జీవితాల మీద చెడు ప్రభావం పడుతుందని, అనవసరమైన విషయాలు నేర్చుకుంటారంటూ  చెప్పుకొచ్చారు. పిలాని నియోజకవర్గంనుంచి ఎస్సీ కోటాలో చట్టసభకు ఎన్నికైన సుందర్లాల్. వాఖ్యాలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. బీజేపి ఎంపీలు, నేతలు, కేంద్రమంత్రులు ఎవరైనా సరే.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పక్షంలో సహించబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు వెదికగా జరిగిన బీజేపి జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోడీ సహా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ సా హెచ్చరికలు జారీ చేసినా వివాదాస్పద వ్యాఖ్యల పరంపర మాత్రం కోనసాగుతూనే వుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP MLA  mobile phones  Sunder Lal  Girls  mobile phones  

Other Articles