Annadana scheme | Tirumala Tirupati Devasthanam | three decades

The annadana scheme of tirumala tirupati devasthanamscompletes three decades

annadanam, thirumala, ttd, ntr, trirupathi, three decades, thirty years, N T Rama Rao, tirumala updeates, thirumala news, annadanam updates

The Annadana scheme of Tirumala Tirupati Devasthanams (TTDs), which was started on April 6, 1985, completes thirty years. The scheme was started by then chief minister of Andhra Pradesh Late N T Rama Rao. However, it was Matrusri Tarigonda Vengamamba, the great saint poetess who pioneered the concept in 18th century.

ప్రత్యేకం: వెంకన్న సన్నిధిలో అన్నప్రసాదానికి 30 ఏళ్లు

Posted: 04/06/2015 12:50 PM IST
The annadana scheme of tirumala tirupati devasthanamscompletes three decades

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు కొలువైన తిరుమలలో అన్నదాన క్షేత్రం నిత్యకల్యాణం.. పచ్చతోరణంలా కళకళలాడుతోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కడుపునిండా భోజనం పెట్టే అన్నప్రసాదాన్ని ప్రారంభించి 30 ఏళ్లు పూర్తయింది. రెండు వేల మందితో ప్రారంభమైన ఈ అన్నదానం..ప్రస్తుతం ప్రతిరోజు సగటున లక్షా పదహారు వేల మంది భక్తుల ఆకలి తీరుస్తూ ముందుకు సాగుతోంది.

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి నిత్యం వచ్చే భక్తుల సంఖ్య సరాసరి 60 వేల నుంచి 90వేలు. వారాంతపు సెలవుల్లో ఈ సంఖ్య లక్షకుపైనే ఉంటున్నా.. వారందరి ఆకలిదప్పికలు తీరుస్తున్న తిరుమల అన్నదాన క్షేత్రం... కలియుగ అక్షయపాత్రగా పేరుగాంచింది. తిరుమలలో నెలకొన్న తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదానం కేంద్రానికి ఎంతమంది భక్తులు వచ్చినా... వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆకలి తీరుస్తోంది. 1985 ఏప్రిల్ 6 న దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతులమీదుగా ప్రారంభమైన ఈ నిత్య అన్నదానం ట్రస్ట్... నాటి నుంచి నేటి వరకు నిరంతరాయంగా కొనసాగుతోంది.

ఇంతటి బృహత్తర అన్నదాన పథకం... భక్తుల విరాళాలతోనే నడుస్తోంది అంటే నమ్మబుద్ధి కాదు...కానీ ఇది నిజం. శ్రీవారి అన్నదానం ట్రస్ట్ కు ఇప్పటివరకు 585కోట్ల రూపాయల విరాళాలు అందాయంటే అంతా ఆ శ్రీనివాసుడి మహిమే. విరాళాల డబ్బులను ఫిక్స్ డ్- డిపాజిట్ చేయగా వచ్చే వడ్డీతోనే నిత్యం అన్నదానం చేయగలుగుతోంది టీటీడీ. దీనికి తోడు నిత్యం టన్నుల కొద్దీ కూరగాయలను భక్తుల కానుకల రూపంలో అందిస్తుండటం విశేషం.

నిత్యం భక్తుల అన్నదానానికి 13 టన్నుల బియ్యం, 6 టన్నుల కూరగాయలను వినియోగిస్తున్నారు. అన్నదానానికి అవసరమైన బియ్యాన్ని ఏపీ రైస్ మిల్లర్స్- అసోసియేషన్..నామమాత్రపు ధరకే అందిస్తూ తన సహకారం అందిస్తోంది. స్వామివారి సేవలో తరిస్తూ... అశేష భక్తజన కోటికి 30ఏళ్ల నుంచి నిర్విరామంగా అన్నదానం చేస్తున్న ఈ విభాగంపై అంతా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

 1985, ఏప్రిల్ 6న రోజుకు రెండు వేల మందితో అన్నదాన కార్యక్రమం ప్రారంభం కాగా... అది నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది.  తిరుమల, తిరుపతి, తిరుచానూరులో రోజుకు 1.16 లక్షల నుంచి 1.42 లక్షల మందికి అన్నప్రసాదాలు అందిస్తున్నారు. 3.6 లక్షల మంది దాతలు ఇచ్చిన .591.36 కోట్ల విరాళాలపై వచ్చే రూ.40 కోట్ల వడ్డీతోపాటు, టీటీడీ 30 కోట్ల గ్రాంట్ కలుపుకుని ఏడాదికి రూ.70 కోట్ల ఖర్చుతో నిత్యాన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

అన్నప్రసాదం తయారీ, పాలనా వ్యవహారాలు చూడటానికి 1250 మంది సిబ్బంది, వీరితోపాటు 400 మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు.  భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదం సిబ్బంది, శ్రీవారి సేవకులు శ్రీవారి ప్రసాదాన్ని ఎంతో భక్తి భావంతో తయారు చేస్తున్నారు. అన్నప్రసాదానికి అవసరమైన సరుకులు, నాణ్యత విషయంలో రాజీ లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తోంది.  అన్నప్రసాదానికి భక్తులు వస్తు, ధన రూపేణా చేయూతనిస్తున్నారు. అన్నప్రసాదానికి కావలసిన కూరగాయలను దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు విరాళంగా అందిస్తున్నారు. ఇప్పటివరకు రెండు లక్షల మందికి పైగా భక్తులు 591 కోట్లు విరాళంగా అందించారన్నారు. ప్రతి సంవత్సరం ఈ పథకానికి 70 కోట్లు ఖర్చు అవుతోంది.

దేవుడి దర్శనానికి వచ్చిన వారెవరూ ఆకలితో వెళ్లకూడదు అన్న మంచి సంకల్పంతో ప్రారంభమైన అన్నప్రసాద కార్యక్రమం వేంకటేశ్వర స్వామి భక్తుల సంఖ్యకు అనుగుణంగా పెరుగుతోంది. అంతకంతకూ పెరుగుతున్న భక్తులకు మరింత నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోంది. అయితే దేవుడి కోసం వచ్చే భక్తులకు నిత్య అన్నదానం చేస్తూ తమ భక్తి ని చాటుకుంటున్నారు అన్న ప్రసాద దాతలు . స్వామి వారి కరుణా కటాక్షాలు ఉంటే అన్ని సాధ్యమే అని వారి నమ్మకం. అందుకే ఎంత ఖర్చుతో కూడుకున్నా.. స్వామి చెంత అన్నప్రసాదం మాత్రం ఆగలేదు. స్వామి వారి కృప అన్నదాతలపై ఉండాలని.. కలకాలం అన్నదాన కార్యక్రమం కొనసాగాలని ఆ అభిలాండ నాయకుడిని కోరుకుందాం.

ఏడు కొండల వాడా వేంకట రమణా... గోవిందా.... గోవిందా

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : annadanam  thirumala  ttd  ntr  trirupathi  three decades  thirty years  

Other Articles