ysrcp mla adinarayana reddy support pattiseema | ys jagan mohan reddy | chandrababu

Ysrcp mla adinarayana reddy support pattiseema project

chandrababu naidu, pattiseema project, pattiseema project controversy, ysrcp mla adinarayana reddy, ys jagan mohan reddy, tdp party ministers, andhra pradesh state, ap capital amaravati, ysrcp party ministers

ysrcp mla adinarayana reddy support pattiseema project : ysrcp mla adinarayana reddy given shock to his party president ys jagan mohan reddy by supporting pattiseema project which is proposed by tdp party in andhra pradesh for rayalaseema.

‘పట్టిసీమ’కు జై.. జగన్ కి ఝలకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

Posted: 04/06/2015 12:39 PM IST
Ysrcp mla adinarayana reddy support pattiseema project

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘పట్టిసీమ’ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవలే శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే! సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నదీజలాలను మళ్లించడం ద్వారా రాయలసీమ నీటి అవసరాలు తీరుతాయన్న ఉద్దేశంతో బాబు సర్కార్ ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. అయితే.. దీనికి వ్యతిరేకంగా వైకాపా అధినేత వైఎస్ జగన్ గళమెత్తిన సంగతీ విదితమే!

ఏళ్ల క్రితం ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టును వదిలి కొత్త ప్రాజెక్టుల పేరిట బాబు నిధులను దోపిడీ చేస్తున్నారంటూ ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో జగన్ పార్టీ అధికార పక్షాన్ని అడుగడుగునా అడ్డుకుంది. ఇక జగన్ ఇదే విషయంపై చర్చించడానికి ఇటీవలే ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఈయన కేంద్రానికి బాబుపై ఫిర్యాదు చేశారు. తన తాబేదారైన కాంట్రాక్టర్ కోసమే బాబు పట్టిసీమ ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్నారని మోదీ సర్కారు వద్ద జగన్ మొరపెట్టుకున్నారు కూడా! ఈయనతోపాటు వైసీపీ నేతలు కూడా ఈ ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. ఓ వైసీపీ ఎమ్మెల్యే మాత్రం ఈ పట్టిసీమకు జై కొడుతూ జగన్ కు తేరుకోని ఝలకిచ్చారు.

పట్టిసీమ ప్రాజెక్టు రాయలసీమకు తప్పనిసరి అంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే, జగన్ పార్టీ నేత ఆదినారాయణరెడ్డి తాజాగా గళమెత్తారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే రాయలసీమ రతనాల సీమ అవుతుందని ఆయన అంటున్నారు. రాయలసీమలో ప్రత్యేకించి జమ్మలమడుగులోని పలు ప్రాజెక్టులు నిండుతాయని ఆయన చెప్పారు. సాగు నీటికే కాక తాగు నీటికీ కొరత వుండదని ఆయన వాదిస్తున్నారు. ఇలా ఈయన ఈ విధంగా ఈ ప్రాజెక్టుపై స్పందించడంతోపాటు వైసీపీ పార్టీ ఒక్కసారిగా షాక్ తింది. ఓవైపు వైసీపీ నేతలు దీనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే.. అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణ గళమెత్తడం చర్చనీయాంశంగా మారింది. మరి.. ఈయన వ్యాఖ్యలపై జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles