నల్గొండ జిల్లాలో సెమీ ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. అర్వపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న సీతారాంపురంలోని ఖాజా నసీరుద్దీన్బాబా దర్గాలో ఆశ్రయం పొందిన ముష్కరులకు ఎవరు సహకరించారన్న కోణంలో విచారణ నిర్వహిస్తున్నారు. దర్గాలో విధులు నిర్వహించే మౌలానా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ముష్కరులు తమ వెంట తెచ్చుకున్న ల్యాప్టాప్, మరికొంత విలువైన సమాచారాన్ని దర్గా పరిసరాల్లో ఉన్న గుట్టల్లో దాచిపెట్టారని అనుమానిస్తున్న పోలీసులు ఆదిశగా అన్వేషిస్తున్నారు. దర్గా పరిసరాలను పోలీసులు తమ ఆదీనంలోకి తీసుకున్నారు.
ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమైనప్పటికీ మరో ముష్కరుడు ఈ పరిసర ప్రాంతాల్లోనే దాక్కొని ఉంటాడన్న సమాచారంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే... తుంగతుర్తి మండలం కుక్కడంలో అనుమానాస్పదంగా హిందీలో మాట్లాడుతూ... తిరుగుతున్న వ్యక్తిని ప్రశ్నించిన స్థానికులు అతన్ని వెంబడించారు. గ్రామస్థుల తీరుతో అనుమానిత వ్యక్తి వరంగల్ జిల్లా పెముప్పారం వైపు పరారయ్యాడు. గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కుక్కడం పరిసరాల్లో అన్వేషిస్తున్నారు. సూర్యాపేట పోలీసులను హతమార్చిన సమయంలో ముగ్గురు వ్యక్తులున్నట్టు బాధిత పోలీసులు గుర్తించారు. మరో ముష్కరుడు ఇదే ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more