Teacher held for raping teenage student in Tamil Nadu

Teacher held for raping teenage student

13-year-old girl student raped by Teacher, teacher Loganathan, Kanchipuram, crime on women, violence on women, sexual harassment on girl, tamilnadu teacher rapes sturdent, Sriperumbudur, case against teachers,

In a shocking incident, a 13-year-old girl student was allegedly raped repeatedly by a teacher in her school with the girl revealing her ordeal after she was found to be pregnant, police said on Saturday.

13 ఏళ్ల విద్యార్థినికి గర్భం.. కాటేసిన పాశవిక మృగం

Posted: 04/04/2015 09:04 PM IST
Teacher held for raping teenage student

తమిళనాడులో ఘోరం చోటుచేసుకుంది. కంచే చేనును మింగేసింది. మొన్న బెంగళూరులో, నిన్న మహారాష్ట్రలో తాజాగా తమిళనాడులో.. ఉపాధ్యాయులు తామ విద్యాబుద్దులు నేర్పుతున్న విద్యార్థునులపైనే అత్యాచారాలకు పాల్పడుతున్నారు. 13 ఏళ్ల అభం శుభం తెలియని అమాయక ఏడవ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యయుడి రూపంలో వున్న సాశవిక మృగం దాడి చేసింది. తన వాంఛ తీర్చుకుంది. ఒకసారి కాదు.. పదే పదే ఈ ఘోరానికి పాల్పడ్డింది ఆ చదువకున్న మృగం. చివరకు ఆమె గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

35 ఏళ్ల వయసున్న ఆ టీచర్ను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. శ్రీపెరుంబుదూర్ సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఆ అమ్మాయిపై అతడు కంప్యూటర్ గదిలో అత్యాచారం చేసినట్లు పోలీసులు చెప్పారు. విపరీతంగా వాంతులు అవుతుండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆమె గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించడతో అప్పుడు టీచర్ దారుణాన్ని గురించి ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది. లోకనాథన్ అనే ఆ టీచర్కు ముగ్గురు పిల్లలున్నారు. అతడిపై పోస్కో చట్టం, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్టు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : student raped  teenage student  teacher  Tamilnadu  

Other Articles