BJP Hints Action Against MPs, MLAs Making Irresponsible Comments

Pm modi amit shah hint at action against leaders making irresponsible comments

PM Modi Amit Shah Hint at Action Against Leaders, BJP Hints Action Against MPs, MLAs, modi amit shah Hints Action Against MPs, MLAs, BJP President Amit Shah, amit shan hints action against leaders, amit shah on leaders making Irresponsible Comments, PM narendra Modi, Amit Shah, comments, Action Against MPs and MLAs, unoin misinsters contrversial statements, bjp mps contrversial statements,

Sending a strong message to leaders who have been causing embarrassment to the party, Prime Minister Narendra Modi and BJP President Amit Shah have hinted at action against them.

మాట మీరితే.. చర్యలే.. బీజేపి నేతలకు హెచ్చరికలు

Posted: 04/04/2015 12:15 PM IST
Pm modi amit shah hint at action against leaders making irresponsible comments

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాటు చేస్తున్న ఎంపీలు, నేతలపై ఇక చర్యలు తప్పేటు లేవు. అధికారంలో వున్నాం కదా అని, ఏలాంటి వ్యాఖ్యాలు చేసినా చెల్లుతుందనుకుంటే మొత్తానికే మోసం ఒనగూరే ప్రమాదముంది. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేలా కొందరు నేతలు, కేంద్ర మంత్రులు అనేక అనవసర విషయాల్లో నోరు జారుతూ.. హద్దులు మీరడం.. పార్టీని పరువును దిగజార్చుతోంది. ఈ నేపథ్యంలో మాట మీరిన నేతలపై చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయించారు. బెంగళూరులో పార్టీ రెండు రోజుల సమావేశంలో శుక్రవారం మొదటిరోజు హాజరైన వీరు బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేస్తున్న తమ పార్టీ నేతలపై ఆగ్రహంగా ఉన్నారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చర్మం రంగుపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యాలు పెద్ద దుమారాన్నే లేపాయి. బీజేపీ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఈ నేపథ్యంలో పార్టీ నేతల తీరుపై వారు మండిపడుతున్నారు. అంతకుముందు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి, ఆ తరువాత యోగి ఆధిత్యనాత్, సాక్షి మహరాజ్, గిరిరాజ్ సింగ్ వరకు బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగుతూనే ఉంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇతర పార్టీల ఆగ్రహాలకు గురయ్యారు. ఆధిత్యనాత్ ఘర్ వాపసీ, నాథురామ్ గాడ్సే దేశభక్తుడిగా పోల్చి,, ప్రతిపిక్షాల విమర్శలను ఎదుర్కోన్నారు గత నవంబర్ లో పార్టీ సమావేశంలో పాల్గొన్న ప్రధాని లక్ష్మణరేఖ దాటవద్దంటూ పార్టీ ఎంపీలకు సూచించారు. అయినా హద్దుమీరుతున్న వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM narendra Modi  Amit Shah  comments  Action Against MPs and MLAs  

Other Articles