Mothkupalli | Governor | Chandrababu

May mothkupalli narsimlu get governor post

mothkupalli, governor, nda, telugudesam, chandrababu, modi, telangana

may mothkupalli narsimlu get governor post? narachandrababu naidu force to the nda govt to get a governor post for the telugu desam party. narachandrababu naidu promise to the mothkupalli for giving governor post in the past elections.

మోత్కుపల్లికి గవర్నర్ పదవి.. ఎన్డీయేపై చంద్రబాబు వత్తిడి..?

Posted: 04/04/2015 08:56 AM IST
May mothkupalli narsimlu get governor post

ఎన్డీయే మిత్రపక్ష కోటా కింద తెలుగుదేశం పార్టీకి గవర్నర్‌ పదవి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ కోరనున్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో దీనిపై మాట్లాడే అవకాశం ఉందని చెబుతున్నారు. చంద్రబాబు వినతికి కేంద్రం అంగీకరిస్తే తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులుకు ఆ అవకాశం దక్కే అవకాశం ఉంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు మోత్కుపల్లికి ఈ మేరకు చంద్రబాబు హామీ ఇచ్చారు. దానిని నెరవేర్చుకోవడానికి ఆయన కొంత కాలంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ పోస్టు సాధించడానికి చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, టీడీపీకి ఒక గవర్నర్‌ పోస్టు ఇవ్వడానికి బీజేపీ నాయకత్వం కూడా సుముఖంగానే ఉన్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఎవరైనా నిపుణుల పేర్లను ఇవ్వాలని ఆ పార్టీ సూచిస్తూ వస్తోంది. కానీ అందుకు టీడీపీ నాయకత్వం ఒప్పుకోవడం లేదు. తమ పార్టీకి చెందిన దళిత నేత, మాజీ మంత్రికే ఆ అవకాశం ఇస్తామని, ఆయనకే ఇవ్వాలని కోరుతోంది.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నేతలను ఉత్సాహపర్చడానికి వారిలో కొందరికి కేంద్రంలో నామినేటెడ్‌ పదవులు ఇప్పించాలని పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఒక గవర్నర్‌ పదవితోపాటు కేంద్రంలో కొన్ని నామినేటెడ్‌ పదవులు కూడా తమకు ఇవ్వాలని ఆయన ప్రధానిని కోరే అవకాశం ఉంది. టీడీపీ కేంద్రంలో ఎన్డీయేలో భాగస్వామి కాగా, ఏపీలోని టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్‌లోని నామినేటెడ్‌ పదవుల్లో కొన్ని తమకు కావాలని టీడీపీ వద్ద బీజేపీ ప్రతిపాదనలు పెడుతోంది. ఎమ్మెల్సీ పదవులు కూడా రెండు కావాలని కోరింది. మార్కెట్‌ కమిటీలు, ఆలయ కమిటీలు, కార్పొరేషన్‌ పదవుల్లోనూ తమకు కొంత భాగం ఇవ్వాలని కోరుతోంది. ఏపీలో బీజేపీకి నామినేటెడ్‌ పదవులు ఇచ్చేటప్పుడు కేంద్రంలో కూడా తాము కొన్ని పదవులు తీసుకోవాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mothkupalli  governor  nda  telugudesam  chandrababu  modi  telangana  

Other Articles