Nalgonda | Firing | Seetharampuram

One more time firing in nalgonda dist of telangana

nalgonda, firing, police, telangana, alert, searching, jajireddy, seetharampuram

one more time firing in nalgonda dist of telangana?Unknown persons gave warning to a motarist and they fire two rounds in air. nalgonda police alert on this incident.police searching for those unknown persons.

నల్గొండలో మరోసారి కాల్పుల కలకలం..!

Posted: 04/04/2015 08:52 AM IST
One more time firing in nalgonda dist of telangana

నల్గొండ జిల్లాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. సూర్యపేట రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని జాజిరెడ్డి గూడెం మండలం సీతారాంపురం గ్రామం సమీపంలో ఇద్దరు దుండగులు ఒక వ్యక్తిని తుపాకితో బెదిరించి మోటార్‌ సైకిల్‌ తీసుకుని పారిపోయారు. మోటార్‌ సైకిల్‌ లాక్కునే ప్రయత్నంలో దుండగులు రెండు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపారు. మోటార్‌ సైకిల్‌ లాక్కున్న గుర్తు తెలియని దుండగులు జనగాం వైపు పారిపోయారు. విషయం తెలుసుకున్న తుంగతుర్తి సిఐ, అరవపల్లి పోలీసులు దుండగులను వెంబడిస్తున్నారు. ఈ దుండగులు సూర్యాపేట కాల్పుల ఘటనలో నిందింతులు అయివుండవచ్చునని అనుమానిస్తున్నారు. సూర్యాపేట హైటెక్‌ బస్టాండులో మూడు రోజుల కిందట పోలీస్‌ కానిస్టేబుల్‌ లింగయ్య,హోంగార్డు మహేశ్ దుండగుల కాల్పులకు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే ఘటనలో సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్‌ మొగిలయ్యతో పాటు మరో హోంగార్డు కిషోర్‌ తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌ లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సూర్యపేట రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని తుంగతుర్తి, జనగాం ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nalgonda  firing  police  telangana  alert  searching  jajireddy  seetharampuram  

Other Articles