Telangana Secratariate | KCR | Erragadda Chesthospital

Telangana govt will start new secretariat construction soon

Telangana, Secratariate, KCR, Tummala nageshwarrao, Erragadda, Chesthospital

The Telangana Government will start work on the construction of its new Secretariat building at Chest Hospital near Erragadda as soon as the design of the premises was complete.

త్వరలోనే ఎర్రగడ్డలో తెలంగాణ సెక్రటేరియట్ కు శ్రీకారం

Posted: 04/02/2015 04:16 PM IST
Telangana govt will start new secretariat construction soon

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ సెక్రటేరియట్ ను ఎర్రగడ్డలోని ఛెస్ట్ ఆస్పత్రి స్థానంలో కొత్తగా నిర్మించాలని తీర్మానించారు. అయితే ఎర్రగడ్డలో ప్రస్తుతం ఉన్న ఛెస్ట్ ఆస్పత్రిని వికారాబాద్ కు తరలించాలని కూడా నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయంతొ కొంత వివాదం నెలకొంది. ప్రతిపక్ష నాయకులు, ఛెస్ట్ ఆస్పత్రి వర్గాలు కూడా కెసిఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. అసలు తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా చర్యలు తీసుకొవాలని ఏకంగా కోర్టును కూడా ఆశ్రయించారు. తరువాత కోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని ప్రకటించింది.

మొత్తానికి విమర్శలు వెల్లువెత్తినా తెలంగాణ సెక్రటేరియట్ ను కొత్తగా ఎర్రగడ్డలొ నిర్మించడానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. ఎర్రగడ్డలో సెక్రటరియట్ పనులు తొందరలోనే ప్రారంభమవుతాయని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావ్ ప్రకటించారు. ఇప్పటికే డిజైన్ రెడీ అయిందని, ఇక త్వరలోనే శంఖు స్థాపన జరిపి పనులు ప్రారంభిస్తామని ఆర్ అండ్ బి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెల్లడించారు. అయితే ఇంకా ఛెస్ట్ ఆస్పత్రి తరలింపు పనులు జరగనే లేదు మరి కొత్త సెక్రటేరియట్ పనులు ఎలా ప్రారంభిస్తారంటూ కూడా విమర్శలు వస్తున్నాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Secratariate  KCR  Tummala nageshwarrao  Erragadda  Chesthospital  

Other Articles