Naralokesh | Hope | Kalavenkatrao

Naralokesh will be the future hope ray of tdp

naralokesh, nara, chandrababu, Tdp, Telugudesam, Tour, kala, venkatrao

naralokesh will be the future hope ray of tdp. kalavenkat rao said that nara lokesh is the future hopeful ray in telugu desam party. he said that lokesh tour will boost the tdp cadder.

అయ్య బాబోయ్.. టిడిపి ఆశాకిరణం ఎవరో తెలుసా..!

Posted: 04/02/2015 03:34 PM IST
Naralokesh will be the future hope ray of tdp

తెలుగు వారి ఆత్మ గౌరవం పేరుతో తెలుగు ప్రజల ముందు వచ్చింది తెలుగు దేశం పార్టీ. ఎన్టీఆర్ పార్టీని స్థాపించి, అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ఎంతో సమర్థవంతంగా పార్టీని ముందుకు తీసుకెళుతున్నారు. అయితే భవిష్యత్ లొ పార్టీ పగ్గాలను ఎవరు చేపడతారు అనేది ఈ మధ్య చర్చనీయాంశంగా మారింది. పార్టీనీ స్థాపించిన నందమూరి వంశానికి చెందిన వారా లేదా నారా కుటుంబ వారసుడా అన్నది చర్చ. అయితే పార్టీ పగ్గాల మాట అటుంచితే పార్టీ లో భవిష్యత్ ఆశాకిరణం ఎవరు అన్న విషయాన్ని మాత్రం పార్టీ సినియర్ నేత కళా వెంకట్రావ్ వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల ఆదరాభిమానాల్ని,  ఎక్కడెక్కడో ఉన్న తెలుగు అభిమానులను కలిగిన టిడిపిలో భవిష్యత్ నేత ఎవరు అన్నదానికి ఓ సీనియర్ నేత క్లారిటీ ఇచ్చేశారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ టిడిపి ఆశా కిరణం అంటూ ప్రకటించారు. ఈ నెల 12 నుండి లోకేష్ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్న నేపథ్యంలో కళా వెంట్రావ్ ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పర్యటన పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని కళా అంటున్నారు. లోకేష్ పర్యటన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున యువత టిడిపిలో చేరడం ఖాయమని కూడా అంటున్నారు. మరి ఆయన అనుకున్నట్లు లోకేష్ తారా జువ్వగా దూసుకుపోతారో లేదా పేలని టపాసులా తుస్సుమనిపిస్తారో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naralokesh  nara  chandrababu  Tdp  Telugudesam  Tour  kala  venkatrao  

Other Articles