Supremecourt | LKAdvani | Babri

Sc issues orders to lk adwani and some more on babri masjid demolition case

supreme court, babri masjid, lk adwani, cbi, ayodhya

A bench of Chief Justice HL Dattu and Justice Arun Mishra, meanwhile, granted four-week time to the Central Bureau of Investigation and others to explain the delay in appealing against the HC order in the demolition of the Babri Masjid on December 6, 1992.

బాబ్రీ కూల్చివేతపై అడ్వానీకి సుప్రీం నోటీసులు

Posted: 03/31/2015 12:46 PM IST
Sc issues orders to lk adwani and some more on babri masjid demolition case

దేశాన్ని కలిచివేసిన బాబ్రీ మసీదు కూల్చివేత వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. బాబ్రీ మసీద్ కూల్చివేతలో హస్తం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజెపి అగ్రనేత ఎల్.కె అడ్వానీ మరోసారి వివాదంలో చిక్కుకుంటున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే గతంలో అడ్వానీతో పాటు మరో 18 మందికి ఈ కేసులో అలహాబాద్ కోర్ట్ ఉపశమనం కలిగించింది. కాగా సిబిఐ మాత్రం అలహాబాద్ కోర్ట్ తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అద్వానీతో పాటుమురళీ మనోహర్ జోషి, కల్యాణ్ సింగ్, ఉమాభారతితో పాటు  వీహెచ్పీ నేతలకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.  ఈ మేరకు జస్టిస్ హెచ్.ఎల్ దత్తు, జస్టిస్ అరుణ్ మిశ్రాలు అడ్వానీతో పాటు పలువురికి నోటీసులు జారీ చేశారు. అలాగే బాబ్రీ మసీదు కూల్చివేత వ్యవహారంలో న్యాయస్థానం వివరణ కోరింది.  తదుపరి విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.

డిసెంబర్ 6, 1992లో నాడు పి.వి నరసింహారావ్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తునపుడు బాబ్రీ మసీదు కూల్చివేతకు ఘటన జరిగింది. అయితే బాబ్రీ మసీద్ కూల్చివేత ఘటనలో కుట్ర పన్నారన్న కేసు నుంచి అద్వానీ, కల్యాణ్ సింగ్, ఉమాభారతి, వినయ్ కటియార్, మురళీ మనోహర్ జోషి తదితరులకు అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 12, 2001లో అలహాబాద్ హైకోర్ట్ ఉపశమనం కల్పించింది. సతీష్ ప్రధాన్, సిఆర్ బన్సల్, అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిశోర్, సాధ్వీ రితంబర, విహెచ్ దాల్మియా, మహంత్ అవైధ్యనాథ్, ఆర్‌వి వేదాంతి, పరమ్ హాన్స్ రామ్ చంద్రదాస్, జగదీష్ ముని మహారాజ్, బిఎల్ శర్మ, నృత్యగోపాల్ దాస్, ధరమ్‌దాస్, సతీష్ నాగర్, మరేశ్వర్ సావే పేర్లను తొలగించారు. మరణానంతరం బాల్ థాకరే పేరును జాబితాలోంచి తీసివేశారు. కాగా తాజాగా అడ్వానీతో పాటు పలువురికి సుప్రీంకోర్టుకు నోటీసులు జారీ చెయ్యడంతో మరోసారి వివాదం వార్తలకెక్కింది. దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం రేపిన బాబ్రీ మసీద్ కూల్చివేత మరోసారి ఎంత సంచనానికి సృష్టిస్తుందో చూడాలి.

- అబినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  babri masjid  lk adwani  cbi  ayodhya  

Other Articles