PV Narasimha Rao | Ghat | Nda

Nda govt plans a memorial for congress pm narasimha rao

PV Narasimha Rao, NDA, Congress party, ghat, delhi, reforms, tdp, telngana

Former PM PV Narasimha Rao, who has driven India from a starving state to sufficient state, will be honoured by the NDA government despite his own party (Indian National Congress) disowned him even before his death. This move is an embarrassing decision for Congress party as it had not even shown respect and attention to perform his last rites in Delhi.

తెలుగు తేజానికి గౌరవం.. పివి ఘాట్ ఏర్పాటుకు సిద్దం

Posted: 03/31/2015 12:40 PM IST
Nda govt plans a memorial for congress pm narasimha rao

భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరినందించిన దివంగత ప్రదాని పి.వి. నరసింహారావ్ కు ఎన్డీయే ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కల్పించనుందా?.. కాంగ్రెస్ కురు వృధ్దుడికి బిజెపి అండగా నిలుస్తోందా?.. తెలుగు తేజం గౌరవ ప్రతిష్టలను మరితం పెంచే ప్రయత్నం జరుగుతోందా? అంటేఅన్నింటికి అవుననే సమాధానం వస్తోంది. తెలుగు వారి కీర్తి ప్రతిష్టలను పదింతలు చేసి, దేశ వృధ్దిని కొత్త పుంతలు తొక్కించారు పి.వి. అయితే పివి నరసింహా రావుకు తగిన గౌరవం లభించలేదని, కాంగ్రెస్ కనీస మర్యాదలు కూడా పాటించలేదని విమర్శలు వస్తున్నాయి. అయితే తాజాగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం పివి నరసింహారావు కు స్మారక ఘాట్ ను కట్టించడం ద్వారా తగిన నివాళి అర్పించాలని చూస్తోంది.

గతంలో పివికి భారత రత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ తీర్మానం కాపీని కూడా కేంద్రానికి పంపింది. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పివి నరసింహారావ్ కు స్మారక ఘాటు ఏర్పాటు చెయ్యాలని గత కొంత కాలంగా పట్టుబట్టారు. మొత్తానికి పి.వి నరసింహా రావు కు స్మారక ఘాటు ఏర్పాటు చెయ్యాలని ఎన్డీయే చర్యలకు దిగింది. ఏక్తా స్థల్ లో పివి నరసింహారావ్ ఘాట్ కు అన్ని ఏర్పాట్లు చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది. యూనియన్ అర్బన్ మినిస్ట్రి గత వారంలో పివి ఘాట్ కు సంబందించి ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచింది. దానికి ప్రభుత్వం నుండి కూడా ఓకే చెప్పడంతో పివి ఘాట్ ఏర్పాటుకు దాదాపు లైన్ క్లీయర్ అని తెలుస్తుంది. కాగా తమ పార్టీకి చెందిన పి.వి పరసింహారావ్ కు ఎన్డీయే ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడంపై కాంగ్రెస్ లోనే సెగలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు మాత్రం తాజా నిర్ణయంతో ఎంతో సంతోషంగా ఉన్నారు. కనీసం ఇన్నాళ్లకైనా మహానేతకు తగిన గౌరవం లభిస్తోందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PV Narasimha Rao  NDA  Congress party  ghat  delhi  reforms  tdp  telngana  

Other Articles