31 leaders personal details leaked at G20 summit

Modi among 31 leaders to have personal details leaked at g20

Modi personal details leaked, Modi and 30 leaders personal details leaked at G20, Prime Minister Narendra Modi, pm modi, 31 world leaders personal details leaked, G20 summit, Australia,

Prime Minister Narendra Modi is among 31 world leaders whose personal details were inadvertently compromised at the G20 summit held in Australia last year, a media report said today.

మోడీ సహా 31 మంది ప్రపంచ దేశాధినేతల డాటా లీక్..!

Posted: 03/30/2015 09:45 PM IST
Modi among 31 leaders to have personal details leaked at g20

ప్రపంచాధినేతల వ్యవహారాలను గోప్యంగా ఉంచాల్సిన సంస్థలు.. వివరాలను ఏకంగా నెట్ లో పెట్టి రచ్చకీడుస్తున్నాయి. తాజాగా  జీ 20 వ్యవహార శైలి కూడా అలానే వుంది. ప్రపంచానికి చెందిన 31 మంది ప్రపంచ దేశాధినేతల పర్సనల్ డాటాను జీ 20 భట్టబయలు చేసింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రపంచ నాయకుల కీలక డాక్యుమెంట్లు ఇంటర్నెట్లో పెట్టేసింది. ఆస్ట్రేలియా అధికారులు పొరపాటున ఈ వివరాలను ఇంటర్నెట్లో పోస్ట్ చేశారని మెల్లిగా నాలుక కరుచుకుంది. ఈ విధంగా లీకైనవాటిలో ఆ నాయకుల పాస్పోర్టు, ప్రయాణ వివరాలతోపాటు వ్యక్తిగత అంశాలు కూడా ఉన్నాయి.

 జీ-20 తొమ్మిదో శిఖరాగ్ర సదస్సు గత ఏడాది నవంబర్లో  ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు ప్రధాని మోదీతోపాటు 31మంది వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. ఆ సందర్భంగా సేకరించిన ప్రపంచ నాయకుల డేటా పొరపాటున ఈ విధంగా బహిర్గతమైంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, జర్మన్ చాన్సలర్ మార్కెల్, చైనా అధ్యక్షుడు జింపింగ్, జపాన్ ప్రధాని షింజో అబే, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ తదితరుల వ్యక్తిగత వివరాలు బయటకు వెల్లడయ్యాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 31 world leaders  personal details leaked  G20 Summit  Brisbane  

Other Articles