ysrcp | mlas | suspention | speaker

Ysrcp mlas are fearing about suspension at ap assembly

ap, assembly, ysrcp, jagan, suspenstion, speaker, kodela

ysrcp mlas are fearing about suspension at ap assembly. ysr congress mlas rash words on ap speaker geeting new preoblems to ysrcp. the tdp leaders propose to suspend the ysrcp mlas from the ap assembly.

రాజీబాటలో జగన్.. భయపడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు

Posted: 03/26/2015 09:29 AM IST
Ysrcp mlas are fearing about suspension at ap assembly

దెబ్బతగిలితే కానీ కట్టు కట్టరు అన్నది సామెత.. ఓసారి జరిగితే కానీ ఏదీ తొందరగా అర్థం కాదు. అయితే ఏపిలో జగన్ మాత్రం మళ్లీ మరోసారి దెబ్బ తినడానికి సిద్దంగా లేరు. అందుకే ముందు మార్గాలపై ఆలోచిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటి అంటే ఏపి అసెంబ్లీ స్పీకర్ పై అవాకులు, చవాకులు వాగిన వైసీపీ నేతలపై వేటుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. దాంతో మరో సారి సభ నుండి సస్పెండ్ అవుతామనే భయం వైసీపీ ఎమ్మెల్యేల్లో మొదలైంది. అందుకే జగన్ కూడా సభ నుండి తమ సభ్యులు సస్పెండ్ కు గురి కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వంతో రాజీబాట పట్టారు.  

టీడీపీ ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసుపై సభలో చర్చ జరిగితే ఏం చేయాలన్న విషయమై జగన్‌ మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయంలో రాజీమార్గమే శరణ్యమని వైసీపీ అధినేత భావిస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. సభాహక్కుల నోటీసుతో వైసీపీ సభ్యులను దీర్ఘకాలం సస్పెండ్‌ చేయించేందుకు టీడీపీ సిద్ధమవుతుండటం జగన్‌ను కలవరపరుస్తోంది.  ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు వేయకుంటే స్పీకర్‌పై తామిచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకుంటామని అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణను కలిసి వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు.

కాగా వైసీపీ పంపిన రాజీ సంకేతాలపై టీడీపీ పెద్దగా ప్రతిస్పందించలేదు. ఈ విషయంలో కఠిన వైఖరిని కొనసాగించే యోచనలో ఆ పార్టీ నాయకత్వం ఉన్నట్లు సమాచారం. వైసీపీ సభ్యులపై వేటు ఖాయమన్న సంకేతాలను టీడీపీ ఇప్పటికే ఇచ్చింది. సభ్యుల ప్రవర్తన తీరును బట్టి శిక్ష ఉంటుందని, ఆరు నెలలపాటు వారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేసే సూచనలు ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. తాము రాజీకి సిద్ధంగా ఉన్నామని, తమ ఎమ్మెల్యేలపై వేటు వెయ్యకుండా ఉంటే స్పీకర్‌పై పెట్టాలనుకొంటున్న అవిశ్వాస తీర్మానాన్ని మేం వెనక్కు తీసుకొంటామని వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపికి తెలిపారు. అయితే టిడిపి ఎమ్మెల్యేలు మాత్రం అన్నింటికి సిద్దంగానే ఉన్నారు. స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టుకొంటే పెట్టుకోవచ్చని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని టిడిపి కుండ బద్దలుకొట్టింది. అంతేకానీ వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలకు మాత్రం వెనుకడుగు వేసేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. మరి ఏపి అసెంబ్లీలో ఏం జరుగుతుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  assembly  ysrcp  jagan  suspenstion  speaker  kodela  

Other Articles