australia | won | toss

Australia won the loss and choose to bat

australia, india, team india, world cup, semi finals

australia won the loss and choose to bat. in the semi finals two of world cup india vs australia match stated. in the toss australia won and choose to bat.

టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

Posted: 03/26/2015 09:01 AM IST
Australia won the loss and choose to bat

వన్డే  ప్రపంచకప్ లో భాగంగా  జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మరో ఆలోచనకు తావు ఇవ్వకుండా ఆసీస్ కెప్టెన్ బ్యాటింగ్ తీసుకున్నాడు. అయితే ముందుగా బౌలింగ్ చేయాల్సిరావడంతో తాము కంగారు పడడం లేదని టీమిండియా కెప్టెన్ ధోని తెలిపారు.  టాస్ గెలిస్తే తాము బ్యాటింగ్ తీసుకునే వాళ్లమని కూడా ధోనీ వెల్లడించాడు. తమ టీమ్ లో ఎటువంటి మార్పులు లేవని తెలిపాడు.

 ఆస్ట్రేలియాకు ఇప్పటి దాకా నాలుగు వరల్డ్ కప్ లు గెలిచిన అనుభవం ఉంటే, భారత్ కు రెండు సార్లు వరల్డ్ కప్ ను గెలిచిన అనుభవం ఉంది. అయితే ఇప్పటి వరకు భారత్, ఆస్ట్రేలియాలు తొమ్మిదిసార్లు వరల్డ్ కప్ ఫైనల్‌స్ కు చేరాయి. ఏడు మ్యాచ్‌లలో ఏడు విజయాలు, ప్రతీ సారి ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేస్తూ టీమిండియా ప్రపంచ కప్ లో దైసుకెలుతోంది. అయితే ఇదే ఫైనల్స్ అన్నట్లుగా రెండు జట్టు ఎంతో కీలకంగా ఈ మ్యాచ్ ను భావిస్తున్నాయి. ఎంతో కీలకమైన ఈ మ్యాచ్ లో రెండు జట్లలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. బ్యాటింగ్ ఆర్డర్ లోనూ రెండు టీంలు మార్పులు చోటు చేసుకోలేదు.

భారత్ ఇప్పటి వరకు ఆడిన ఆటంతా వేరు, కానీ  ఈ ఒక్క మ్యాచ్‌లో ఆడాల్సిన ఆట వేరు. పాక్‌ను కొట్టినంత సులభంగా ఆసీస్‌ను ఓడించడం భారత్ అంత సులభం కాదు. టీమిండియా గత చరిత్ర, లెక్కలు ప్రతికూలంనే ఉన్నాయి. అయితే టీమిండియా ప్రస్తుతం ఫామ్ లో ఉండటం, పరిస్థితులు టీమిండియాకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. అయితే బారత్ టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ కు దిగి ఉంటే బాగుంటుందని అందరు అనుకున్నారు. కానీ టాస్ ఆస్ట్రేలియా గెలిచింది. అయితే మ్యాచ్ మనం గెలుస్తాం అన్న ధీమా టీమిండియా అభిమానుల్లో ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : australia  india  team india  world cup  semi finals  

Other Articles