mlas | IPhone6 | gifts

Ap govt decided to give iphone6 to the mlas

iphone6, mlas, ap, chandrababu, andhrapradesh

ap govt decided to give iphone6 to the mlas. ap govt decided to give a surpise gift to the mlas. the chandrababus govt will gift iphone 6 to all mlas soon.

ఐఐ.. ఎమ్మెల్యేలకు ఐఫోన్ లు

Posted: 03/25/2015 04:50 PM IST
Ap govt decided to give iphone6 to the mlas

ఆ మధ్య ఎంపీల జీతాలు పెంచాలని ప్రతిపాదిస్తు సహచర ఎంపీలు చేసిన తీర్మానాన్ని క్షణాల మీద బిల్లుగా మార్చి భారత పార్లమెంట్ ఘటనతను చాటారు మన నేతలు. అలా ప్రజలు కావాలని వాటి గురించి మాట్లాడటానికి రోజులు, వారాలు కుదిరితే సంవత్సరాల కాలం పాటు సాగదీసే మన నేతాగణం వారి అవసరాలకు తగ్గట్టుగా మాత్రం వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎంపీల జీతాలను పెంచాలని, నియోజకవర్గానికి ఇచ్చే ఫండ్ ను పెంచాలన్న నిర్ణయాలపై ఎలాంటి చర్చ కూడా లేకుండా వెంటనే బిల్లు ఆమోదం పొందుతుంది ఎందుకంటే ఇది ఇండియా. అయితే అసలే హైటెక్ బాబుగా పేరుతెచ్చుకున్న బాబు చంద్రబాబు. ఏపి ఎంతో ఆర్థికంగా వెనుకబడి ఉంది అని మీడియా ముందు మాట్లాడే ఆయన, తాజా నిర్ణయంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి అసలే నిధుల కొరత ఉంది అని అందరూ బాధపడుతుంటే చంద్రబాబు మాత్రం తన ఇష్టం వచ్చినట్లు ఎడాపెడా ఖర్చులు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలందరికీ రాష్ట్ర ప్రభుత్వం కానుకలు ఇవ్వనుంది. కానుకలంటే అలాంటి ఇలాంటి కానుకలు కాదు, ఈ మధ్యే మార్కెట్లో హల్‌చల్ చేస్తున్న యాపిల్ ఐఫోన్6 లను ఎమ్మెల్యేలకు కానుకగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానుకుగా ఇవ్వనున్న ఒక్కో ఐఫోన్ ధర సుమారు 50 వేలు. రాష్ట్రం ఆర్థికపరంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉందనీ, ఆర్థిక పురోగతి సాధించాల్సిన అవసరం ఉందనీ.. ఓ వైపు ఊదరగొడుతున్న చంద్రబాబు నాయుడు,  ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇంత విలువైన కానుకలు ఇవ్వాల్సిన అవసరం ఏంటని పలువురు వాపోతున్నారు. అయితే ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఏకంగా ఐఫోన్ లు ఇస్తున్నారంటే వారిని బాగా వాడుకుంటారని కూడా మరో వాదన ఉంది. ఏది ఏమైనా ఏపి ఎమ్మెల్యేలకు మాత్రం ఇది సంతోషం కలిగించే వార్తే.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : iphone6  mlas  ap  chandrababu  andhrapradesh  

Other Articles