mlc | counting | today

Mlc election results in telanagana will out today

mlc, counting, elections, lagislative, council, telanagana, trs, bjp

mlc election results in telanagana will out today. last sunday poll done for the two council constutions in telanagana. the election commision completed all preparations for counting.

ఎమ్మెల్సీ భవిత తేలేది నేడే. మాదే గెలుపంటూ అన్ని పార్టీల ధీమా

Posted: 03/25/2015 08:50 AM IST
Mlc election results in telanagana will out today

తెలంగాణ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో నేడు తేలిపోతుంది. అయితే ఎన్నికల ఫలితాలపై ప్రధాన పార్టీలైన టిఆర్‌ఎస్‌, టిడిపి-బిజెపి కూటమి అభ్యర్థులు గెలుపు ధీమా వ్యక్తంచేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో అధికశాతం ఓట్లు నమోదు కావడంతో  మహబూబ్ నగర్- హైదరాబాద్ - రంగారెడ్డి నియోజక వర్గంలో టిఆర్‌ఎస్‌ గెలుస్తుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మహబూబ్ నగర్ లో ముందు నుండి గట్టి పట్టున్న బిజెపి గెలుస్తుందని మరో వాదన. రంగారెడ్డి జిల్లాలోని ఎక్కువ శాతం ఓట్లు బిజెపి అభ్యర్థి, హైదరాబాద్‌లోని ఓట్లు ఇద్దరికీ పడ్డాయని విశ్లేషకుల అంచనా. దీంతోపాటు కంటోన్మెంట్‌ ఎన్నికల తరహాలోనే టిఆర్‌ఎస్‌ అభ్యర్థి దేవీప్రసాద్‌ గెలుస్తారని, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో రాంచందర్‌రావు గెలుస్తారని ఆయా పార్టీల నేతలు ప్రచారం చేస్తున్నారు. మూడు జిల్లాలో 2,96,317 ఓట్లు ఉన్నాయి. వీరిలో పురుషులు 1,98,182, మహిళలు 98,113, ఇతరులు 22 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల్లో మాత్రం 1,11,766 ఓట్లు పోలయ్యాయి. వీరిలో పురుషులు 83,238, మహిళలు 28,528 ఉన్నారు. ఇతరులు ఒక్కరూ ఓటెయ్యలేదు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో అత్యధికంగా నమోదయ్యాయి.

ఎంఎల్‌సి ఎన్నికల కౌంటింగ్‌ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. లెక్కింపు కోసం 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై 1000 ఓట్ల చొప్పున రౌండ్‌కు 28వేలు, మూడు దశల్లో నాలుగు రౌండ్లలో లెక్కించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే 2009లో 58వేల ఓట్లు నమోదయ్యాయి. వాటిని లెక్కించడానికి సుమారు 30 గంటల సమయం పట్టింది. ఈ సారి 1,11,766 ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల ఆధారంగా అయితే సుమారు 50 గంటలకుపైగా సమయం తీసుకునే అవకాశమున్నదని అంచనా. పట్టభద్రుల ఓట్ల లెక్కింపు మూడు దశల్లో చేయనున్నామని, ఒక్కో దశకు 6-8గంటల సమయం పడుతుందని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నవీన్‌మిట్టల్‌ తెలిపారు. . ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. మహబూబ్ నగర్- హైదరాబాద్ - రంగారెడ్డి నియోజక వర్గ ఓట్ల లెక్కింపు హైదరాబాద్ లోని విక్టరీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. వరంగల్- ఖమ్మం-నల్గొండ నియోజక వర్గ ఓట్ల లెక్కింపును నల్గొండలోని నాగార్జున ప్రభుత్వం కాలేజీలో లెక్కించనున్నారు. మరి మరి కొంత సమయంలోనే ఎమ్మెల్సీలుగా ఎవరు గెలిచారో తేలుతుంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mlc  counting  elections  lagislative  council  telanagana  trs  bjp  

Other Articles