ssc exams | telanagana | today

From today tenth class exems in the new state telanagana

tenth exams, ssc exams, telanagana, secondary school

from today tenth class exems in the new state telanagana. after forming as the new state telangana first tenth class board exems from today. the officials complete all preparations for the exams.

నేటి నుండి పదో తరగతి పరీక్షలు.. అన్ని ఏర్పాట్లు పూర్తి

Posted: 03/25/2015 08:43 AM IST
From today tenth class exems in the new state telanagana

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. నేటి నుండి ఏప్రిల్‌ 11 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి.  రాష్ట్రంలో 5.65 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారు. వారిలో బాలురు 2,92,594 మంది ఉండగా, బాలికలు 2,79,119 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2614 కేంద్రాలలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారిగా జరుగుతున్న పరీక్షలు కావడంతో అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ముందుకు సాగడానికి అధికారులు సిద్ధమయ్యారు. పరీక్షల నిర్వహణ కోసం పోలీసు, ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళుతున్నట్టు అధికారులు ప్రకటించారు. పరీక్షల పరిశీలన కోసం రాష్ట్రంలో 144 మంది స్క్వాడ్లను నియమించారు. వీరు కాకుండా ప్రతిజిల్లాకు ఒక లైజనింగ్‌ అధికారిని నియమించారు.

ఈ సారి పదో తరగతి పరీక్షా విధానంలో స్వల్ప మార్పులు చేశారు. పరీక్షలో అబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉండవు. మారిన పరీక్ష పేపర్‌ను మొదటిసారిగా రాస్తున్న విద్యార్ధులు అర్ధం చేసుకోవడానికి అదనంగా 15 నిమిషాలను కేటాయించారు. పరీక్ష ఉదయం 9.30 నిమిషాల నుండి మధ్యాహ్నాం 12.15 వరకు ఉంటుంది. పరీక్షల సందేహాలను నివృత్తి చేసుకోవడానికి హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేశారు. విద్యార్ధుల కోసం 040-23230941, 040-23230942 హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి 15 నిమిషాల కంటే ఆలస్యంగా వస్తే అనుమతించ కూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. పరీక్షా కేంద్రాల్లో విద్యుత్‌ అంతరాయం రాకుండా చూడాలని విద్యుత్‌ శాఖను అధికారులు ఆదేశించారు. పరీక్ష హాల్‌టికెట్లు ఉంటే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేలా అవకాశం కల్పించినట్టు అధికారులు తెలిపారు. మొత్తానికి పదో తరగతి పరీక్షలు అటు విద్యార్థులకు, ఆటు వారి తల్లిదండ్రులకు చెమటలు పట్టిస్తున్నాయి. పదో తరగతి పరీక్షలు రాస్తున్న వారందకీ మా తరఫున ఆల్ ది బెస్ట్...

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tenth exams  ssc exams  telanagana  secondary school  

Other Articles