Veteran actor shashi kapoor gets the dada saheb phalke award

Shashi Kapoor news, Shashi Kapoor dada saheb phalke award, Shashi Kapoor bypass surgery, Shashi Kapoor history, Shashi Kapoor life time awards, Shashi Kapoor movie career, Shashi Kapoor filmography, dada saheb phalke award, indian film industry

Veteran actor Shashi Kapoor gets the Dada Saheb Phalke Award : Finally! Veteran actor Shashi Kapoor (76) gets the Dada Saheb Phalke Award who has featured in over 160 movies.

76వ ఏటలో షషికపూర్ ని వరించిన ‘దాదా’

Posted: 03/23/2015 06:32 PM IST
Veteran actor shashi kapoor gets the dada saheb phalke award

అలనాటి వెటరన్ నటుడు అయిన షషికపూర్ కు ఎట్టకేలకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందింది. 1938 మార్చి 18వ తేదీన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో జన్మించిన షషీ కపూర్.. 160కిపైగా సినిమాల్లో నటించారు.

3 జాతీయ, 2 ఫిల్మ్ ఫేర్ అవార్డులతోపాటు 2010లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులు అందుకున్నారు. ‘దీవార్, సిల్సిలా, సత్యం శివం సుందరం’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో గొప్ప నటుడిగా ఈయన పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నటించిన సినిమాలు కూడా మంచి హిట్ సాధించినవే! గతకొన్ని సంవత్సరాల నుంచి అనారోగ్యం బారిన పడిన ఈయన.. ఇటీవలే బైపాస్ సర్జరీ చేయించుకున్నారు.

ఇదిలావుండగా.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే అత్యంత గొప్ప అవార్డుగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు ఇండియన్ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడిన వ్యక్తులకు మాత్రమే ఇస్తారు. వెటరన్ యాక్టర్ అయిన షషి కూడా అప్పట్లో ఇండస్ట్రీ అభివృద్ధికి తనవంతు సహాయసహకారాలను అందించారు. అయితే.. ఇన్నాళ్లకు భారతీయ ప్రభుత్వం ఈయనను గుర్తించి చివరికీ ఈ అవార్డుతో పురస్కరించారు. గతేడాది ఈ అవార్డు ప్రముఖ లిరసిస్ట్, రచయిత గుల్జార్ కు వరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shashi Kapoor  dada saheb phalke award  indian film industry  

Other Articles