Emotional scene in ap assembly while sessions

ap, assembly, roja, peethala sujatha, ysrcp, sessions

emotional scene in ap assembly while sessions. in ap assemb;y sessions different different emotions are exhibited. already ysrcp leaders and tdp leaders express their anger in assembly. today ap minister peethala sujatha cried at assembly

ఏమైందీ.. పాపం మహిళా మంత్రి ఏడ్చింది

Posted: 03/23/2015 04:16 PM IST
Emotional scene in ap assembly while sessions

ఏపి అసెంబ్లీలో నిన్నటి దాకా బూతుల పర్వం సాగింది. నువ్వు అంతా.. అంటే నువ్వు ఇంతా అంటూ తొడలుకొట్టుకున్న సందర్భాలను తెలుగు ప్రజలు కళ్లారా చూశారు. ఇక ఈ రోజు మరో కొత్త ఎపిసోడ్ మొదలైంది. నిన్నటి దాకా ఫైట్ సీన్లతో వేడెక్కిన సభ, ఈ రోజు సెంటిమెంట్ సీన్లతో ముద్దముద్దగా అయింది. నిన్నటి దాకా ఒకరి మీద ఒకరు తిట్టుకున్న నాయకులను చూసిన తెలుగు వారికి కొత్తగా కన్నీళ్ల ఎపిసోడ్ తెర తీసింది. వైసీపీ ఎమ్మెల్యే రోజా లాంటి వ్యక్తి మహిళాజాతికే కళంకమని, వైయస్ఆర్ సిపి నాయకులకు పనీ పాట లేదని దుమ్మెత్తి పోసిన మహిళా మంత్రి  పీతల సుజాత ఏపి అసెంబ్లీలో కొత్త అంకానికి తెర తీశారు.

ఏపి మహిళా మంత్రి పీతల సుజాత రోజా తనపై చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ క్రమంలో బావోద్వేగానికి లోనైన పీతల సుజాత కంటతడి పెట్టారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఆమె, తన స్పీచ్ ను మధ్యలోనే ఆపేశారు. కొంత సమయం వరకు మౌనంగా ఉన్నారు. కాసేపటికి కన్నీరు తుడుచుకొని మళ్లీ మాట్లాడారు. పేద కుటుంబంలొ పుట్టిన తాను ఎంతో క్రమశిక్షణ, సంస్కారంతొ పేద కుటుంబం నుండి వచ్చానని తెలిపారు. అవినీతి మకిలీ అంటని చంద్రబాబు సర్కార్ లో పని చేస్తున్నాని ఆమె వెల్లడించారు. రోజా మాటలు వింటుంటే భవిష్యత్ సమాజంపై భయం కలుగుతోందని అన్నారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చెయ్యడానికి కూడా సిద్దమని పీతల సుజాత ప్రకటించారు. మొత్తానికి నిన్నటి దాకా ఏపి అసెంబ్లీ లో పైటింగ్ సీన్లు ఉంటే, నేడు ఎమోషనల్ సీన్లు అందరిని పిండేశాయి. మొత్తానికి నవరసాలను కలిగిన ఏపి అసెంబ్లీ ఇంకా ఎన్ని బావోద్వేగాలకు వేదికగా మారుతుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  assembly  roja  peethala sujatha  ysrcp  sessions  

Other Articles