Ias officer dk ravi suicide case new twist love angle

ias officer dk ravi suicide, ias dk ravi suicide case, ias dk ravi love angle, ias dk ravi murder controversy, bangalore ias ravi dk ravi news

ias officer dk ravi suicide case new twist love angle : A new twist came in ias officer dk ravi suicide case that he could in love with woman ias officer who is working in karnataka state.

ఐఏఎస్ రవి ఆత్మహత్య కేసులో ‘ప్రేమకథాచిత్రం’

Posted: 03/20/2015 05:36 PM IST
Ias officer dk ravi suicide case new twist love angle

కర్ణాటకలో ఐఏఎస్ అధికారి డీకే రవి మృతి కేసు పెద్ద సంచలనం రేపిన విషయం తెలిసిందే! ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అతన్ని ఎవరైనా చంపారా..? అతని మరణం వెనుక మాఫియా హస్తముందా..? అన్న ప్రశ్నలకు ఇంకా సమాధానం లభించలేదు కానీ.. తాజాగా ఈ కేసులో ఓ కొత్త మలుపు తిరిగింది. ఈయన హత్యకేసులో ఓ ప్రేమకథాచిత్రం వుందన్న సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. రవి ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్న రోజే ఈయన ఓ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ కు 44 సార్లు ఫోన్ చేసినట్లు అధికారులు తమ విచారణలో గుర్తించారు. అంతేకాదు.. రవి ఆమెకు కొన్ని మెస్సేజ్ లను కూడా పంపినట్లు సమాచారం! తొలుత ఆమె గురించిన వివరాలు సేకరించిన అధికారులు.. ఆ అధికారిణి రవికి 2009 సంవత్సరంలో బ్యాచ్ మేట్ అని తెలిసింది. ప్రస్తుతం దక్షిణ కర్నాటకలో పనిచేస్తున్న ఆమెకు పెళ్లయి ఓ పాప కూడా వుందని తెలుస్తోంది. రాజకీయ నాయకుడు హనుమంతరాయప్ప కుమార్తె కసుమను వివాహం చేసుకోక ముందు రవి, ఆమె ఇద్దరు మంచి స్నేహితులని పోలీసులు భావిస్తున్నారు. ఆమెను ఉద్దేశించి రవి తన ఫేస్ బుక్ పేజీలో పోస్టులు కూడా పెట్టిన ఓ ఆంగ్ల దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది కూడా!

ఈ నేపథ్యంలోనే ఆ అధికారిణిని దర్యాప్తులో భాగంగా పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈమెకు, ఐఏఎస్ అధికారి రవికి మధ్య వున్న బంధమేమైనా అతని ఆత్మహత్యకు ప్రేరేపించిందా అనే కోణంలో అధికారులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కోణంలో విచారణ చేపడితే కనీసం అతని మరణం వెనుక వున్న అసలు కథ ఏమైనా బయటపడవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ias officer dk ravi suicide case  ravi suicide love angle twist  

Other Articles