Supreme court clear the ways to construct new capital in ap

supreme court, capital,ap, pil, new capital, land, environment

supreme court clear the ways to construct new capital in ap. in andhrapradesh newly constructing capital have got a peteition for environment litigations. supreme court clear that it will not interfear in the capital city issue.

కొత్త రాజధానిపై సుప్రీం కోర్టు లైన్ క్లీయర్

Posted: 03/20/2015 03:18 PM IST
Supreme court clear the ways to construct new capital in ap

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని భూసమీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. రాజధాని నిర్మాణంలో జోక్యం చేసుకోలేమని  సుప్రీం కోర్టు  స్పష్టం చేసింది. భూసమీకరణను వ్యతిరేకిస్తూ మాజీ జర్నలిస్టు శ్రీమన్నారాయణ  సుప్రీం కోర్టు లో పిటిషన్‌ దాఖలు చేశారు. రాజధానికి సంబంధించి పర్యావరణాన్ని అంచనా వేయకుండా దీన్ని నిర్మిస్తున్నారంటూ పిటిషన్‌లో ప్రధానంగా పేర్కొన్నారు. ఫలితంగా పర్యావరణానికి తీరని నష్టం కలుగుతొందని ఆరోపించారు. పచ్చటి పొలాలను రాజధాని పేరుతో నాశనం చేస్తున్నారని పిటిషనర్ అందులో పేర్కొన్నారు.
 
దీనిపై విచారణన జరిపిన సుప్రీం కోర్టు జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధానిని ఎక్కడ నిర్మించాలనే దానిపై సుప్రీం కోర్టు డైరెక్షన్‌ చేయలేదని దానిపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. మహానగరాల నిర్మాణం సమయంలో సమస్యలు సహజమని, ఒకరికి లాభం కలిగితే మరొకరికి నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. పర్యావరణ అనుమతులు ప్లానింగ్‌ దశలో అవసరం లేదని పేర్కొన్నారు. పర్యవసానాలు అంచనా వేయకుండా ఎవరూ రాజధానిని నిర్మించరని సుప్రీం కోర్టు జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు వెల్లడించారు. మొత్తానికి  సుప్రీం కోర్టు రాజధాని నిర్మాణానికి అడ్డంకికాకుండా క్లియరెన్స్ ఇవ్వడం ఏపి ప్రభుత్వానికి కొంత మేలు చేసింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  capital  ap  pil  new capital  land  environment  

Other Articles