All party leaders request to quit suspention on ttdp mlas

telanagana, assembly, suspenstion, janareddy, laxman, eetela, nayini, maharastra, ap

all party leaders request to quit suspention on ttdp mlas. congress leaders, bjp and all party leaders requsted to assembly speaker madhusudhanachary for quit the suspention on ttdp leaders.

పాపం.. సస్పెన్షన్ ఎత్తివెయ్యండి సార్

Posted: 03/20/2015 01:48 PM IST
All party leaders request to quit suspention on ttdp mlas

టిటిడిపి ఎమ్మెల్యేల  సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని విపక్షాలు స్పీకర్ కు విజ్ఞప్తి చేశాయి. బడ్జెట్‌పై అందరి సలహాలు, సూచనలు పొందాల్సిన సభలో టిటిడిపి సభ్యులు లేకపోవడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. రెండు మూడు రోజులు చూశాక పరిశీలిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారని, ఇకపైన వారిపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని వారు కోరారు.  
టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని బీజేఎల్పీ నేత లక్ష్మణ్‌ అన్నారు. సస్పెన్షన్‌పై స్పీకర్‌ పునరాలోచించాలని ఆయన కోరారు. ఏపీ అసెంబ్లీలో మన కంటే ఎక్కువ గొడవ జరిగిందని అయినా అక్కడ సభ్యులను మూడు రోజులే సస్పెండ్‌ చేశారని సీఎల్పీనేత జానారెడ్డి వెల్లడించారు. టీడీపీ సభ్యులు సభలోకి వచ్చేలా స్పీకర్‌ చొరవ చూపాలని జానా కోరారు. బడ్జెట్‌పై చర్చలకు టీడీపీ సభ్యులను అనుమతించాలని లెఫ్ట్‌ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్‌, రాజయ్య స్పీకర్‌ను కోరారు. టీడీపీ సభ్యులు లేని లోటు సభలో కనపడుతోందని తెలిపారు. సభలో గందరగోళ వాతావరణంతో టీడీపీ సభ్యులు క్షమాపణలు చెప్పలేకపోయారని రవీంద్రకుమార్‌, రాజయ్య అన్నారు.
 
అయితే దీనిపై స్పందించిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సభ వెలుపల కూడా తెలంగాణ టీడీపీ సభ్యుల వైఖరి సరిగా లేదన్నారు. ఓ సెషన్ మొత్తం సస్పెన్షన్ వెయ్యడంపై మంత్రి వివరణ ఇచ్చారు. మహారాష్ట్రలో సభ్యులను రెండేళ్లు సస్పెండ్‌ చేశారని దానిపై జానారెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కావాలనే టీడీపీ సభ్యులు జాతీయ గీతాన్ని అవమానపరిచారని ఆర్థిక మంత్రి ఈటెల వ్యాఖ్యానించారు. ఏపార్టీకైనా విమర్శించే అర్హత ఉందన్నారు. అయితే స్పీకర్‌ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి ఈటెల రాజేందర్‌ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పరిశీలించి, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్‌ మధుసూదనాచారి తెలిపారు. మొత్తానికి సస్పెన్షన్ కు గురైన టిటిడిపి నాయకులకు మద్దతుగా అసెంబ్లీలో అన్ని పార్టీల నేతలు మాట్లాడారు. వారిని సభలోకి అనుమతించాలని వారు స్పీకర్ ను కోరారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telanagana  assembly  suspenstion  janareddy  laxman  eetela  nayini  maharastra  ap  

Other Articles