Ap assembly sessions going ugly scences repeat

ysrcp, chandrababu, jagan, speaker, ap, assembly, strike, tdp, bonda, kodela

in ap assembly ysrcp leaders come to speaker podium and gave slogans. ys jagan attacks on chandrababu. speaker order to wuit the sprrch to jagan.

వాళ్లు మారరు.. ఏపి అసెంబ్లీలో అదే సీన్

Posted: 03/19/2015 11:33 AM IST
Ap assembly sessions going ugly scences repeat

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు గతంలో లేనట్లు చరిత్రహీనంగా జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరిగిన దాఖలాలు లేవు.. కానీ ప్రస్తుతం మాత్రం అసెంబ్లీ సమావేశాలు అంటే ఎమ్మెల్యేలు తిట్టుకోవడానికి.. కొట్టుకోవడానికి అన్నట్లు జరుగుతున్నాయి. ప్రజాసమస్యల మీద మాట్లాడండి అంటే.. వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారు. రేయ్.. పాతరేస్తా అని ఒకరంటే.. రండి చూసుకుందాం అని మరొకరు ఇలా దూషణల పర్వం సాగుతోంది.

ఏపి అసెంబ్లీలో నిన్న జరిగిన గందరగోళం అంతాఇంతా కాదు అందరు దీనిపై విమర్శలు చేస్తున్నారు. అయినా ఎమ్మెల్యేల వైఖరలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఎప్పుడు సమావేశం ప్రారంభమవుతుందా ఎప్పుడు దాడికి దిగుదామా అన్నట్లున్నారు ఎమ్మెల్యేలు. నేటి సభ ప్రారంభంలోనే జగన్ చంద్రబాబుపై విమర్శలకు దిగారు. అయితే జగన్ ప్రసంగం ఎంతకీ ముగియక పోవడంతో స్పీకర్ తొందరగా ముగించాలని చెప్పి, తరువాత మైక్ కట్ చేశాడు. దాంతో ప్రతిపక్షనేత మాట్లాడుతుంటే ఎలా మైక్ కట్ చేస్తారంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పోడియం వద్ద ఆందోళనకు దిగారు. కాగా అసెంబ్లీ నుండి ప్రసారమవుతున్న లైవ్ లో ఈ దృశ్యాలు ప్రాసారం కావడం విశేషం. కాస్త గందరగోళం తలెత్తినా వెంటనే లైవ్ ప్రసారాలను నిలిపివెయ్యడం మామూలే కానీ ప్రతిపక్షనాయకులు పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేస్తున్న వీడియో లైవ్ టెలికాస్ట్ కావడం ఇదే మొదటిసారి. మొత్తానికి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఏపి అసెంబ్లీ ఇప్పుడు అందులో కొత్తగా రికార్డులను సృష్టిస్తోంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp  chandrababu  jagan  speaker  ap  assembly  strike  tdp  bonda  kodela  

Other Articles