Ys jagan said that ys rajashekar reddy tried to get irrigation in ap

ys jagan, chandrababu, ys rajashekarreddy, ravela, polavaram, almatti dam, irrigation

ys jagan said that ys rajashekar reddy tried to get irrigation in ap. in ap assembly ys jagana questioned ap govt on polavaram, handrineva. ap minister sentenced that ys rajashekar is a cheater.

ఆ పుణ్యం వైయస్ రాజశేఖర్ రెడ్డిదే...

Posted: 03/18/2015 11:53 AM IST
Ys jagan said that ys rajashekar reddy tried to get irrigation in ap

హాట్ హాట్ గా సాగుతున్న ఏపి అసెంబ్లీ సమావేశాలు నీటి కేటాయింపులపై మరింత వేడిగా సాగుతున్నాయి. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి అలసత్వమే కారణం అంటూ ఏపి భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని విమర్శించారు. దాంతో సభలో గందరగోళం నెలకొంది. దేవినేని ఆరోపణలను జగన్ తప్పుపట్టారు. చంద్రబాబు హయాంలో సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు వల్లే ఆల్మట్టి డ్యాం ఎత్తు పెరిగిందని జగన్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పు కాపీని జగన్ అసెంబ్లీలొ చదివి వినిపించారు. గాలేరు - నగరి, హంద్రినీవా, వెలిగొండ ప్రాజెక్టులు రాజశేఖర్ రెడ్డి కృషికి నిదర్శనమన్న జగన్, తాజా బడ్జెట్ లో వీటికి అరకొర నిధులను కేటాయించారని విమర్శలు చేశారు. మరో పక్క పోలవరానికి  ఎవ్వరూ వ్యతిరేకంగా లేరని జగన్ వెల్లడించారు. పట్టిసీమకు సంబందించి జీవో నెంబర్ 1 ని విడుదల చేశారని, అందులో రాయలసీమకు నీళ్లిస్తామని ఒక్క మాటైనా ఉందా అని జగన్ ప్రశ్నించారు. మరో పక్క జగన్ వ్యాఖ్యలకు టిడిపి నుండి గట్టిగానే సమాధానం వచ్చింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి వల్లే ఆల్మట్టి నుండి నీరు రాకుండా పోయిందని టిడిపి ఎదరుదాడి చేసింది. ప్రాజెక్టుల పేరుతో ధనార్జన చేసిన వైస్ రాజశేఖర్ రెడ్డి ముమ్మాటికి రైతు ద్రోహి అని మంత్రి రావెల కిశోర్ బాబు ఆరోపించారు.

* అభినవచారి *

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ys jagan  chandrababu  ys rajashekarreddy  ravela  polavaram  almatti dam  irrigation  

Other Articles