America s first indian lesbian wedding and it is beautiful

America's First Indian Lesbian Wedding, Beautiful Indian Lesbian Wedding, video goes viral on social media, Photographer Steph Grant, shannon and seema, First Indian Lesbian Wedding, First Indian Lesbian Wedding video goes viral, shannon and seema

Shannon saw Seema at a fitness class she teaches. She then turned to a fellow instructor and said "I’m going to marry her." 6 years later, they married, and it was beautiful.

ITEMVIDEOS: ఔను వాళ్లిద్దరి పెళ్లి వీడియో నెట్ లో హల్ చల్..

Posted: 03/16/2015 05:32 PM IST
America s first indian lesbian wedding and it is beautiful

ఔను వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. శీర్షిక చూస్తేనే ఏదో విశేషం వుందని అనుకుంటున్నారు కదూ..? నిజమే. వాళ్లిద్దరు పెళ్లి వీడియో ఇంటర్ నెట్ లో ముఖ్యంగా సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. ఎందుకలా.. ఎందరెదగో పెళ్లి చేసుకుంటున్నారు. అయితే మాత్రం వీరి పెళ్లి వీడియోలో అంతటి విశయమేముంది, ఎందుకు నెట్ లో హల్ చల్ చేస్తోంది. అనుకుంటున్నారా..? అమెరికాలోనూ జరిగే సర్వసాధారణమైన పెళ్లిళ్ల క్రమంలో భారతీయుల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కానీ ఈ జంట పెళ్లా మాత్రం స్పెషల్. అమెరికాలో జరిగిన తొలి భారతీయుల పెళ్లిగా వీరి పెళ్లి రికార్డులను కూడా చేరింది. అదేంటి అన్న సందేహం మీలోనూ కలుగుతుందా..?

అమె పేరు షనాన్, అమె జిమ్ పిట్ నెస్ ఇన్స్ స్ట్రక్టర్. తొలిసారిగా సీమాను జిమ్ లోనే చూసింది. చూసి చూడంగానే అమెను పెళ్లి చేసుకుంటానని తన సహచరితో చెప్పింది అనుకున్నట్లుగానే ఆరేళ్ల తరువాత.. ఆ జంట ఒక్కటైంది. దృడబంధం ఏర్పడింది. ఏడాది కావస్తున్నా.. ఇప్పటికీ జంట సంతోషంగానే వుంది. అన్ని తప్పులే అంటూ నిష్టూరాలు అడకండి. ఎందకంటే మేం రాసింది కరక్టే. ఇందులో ఎవరు ఆడ..? ఎవరు మగ..? అన్నదే లేదు అనుకోకండి. వారిద్దరూ ఆడవాళ్లే. అదే ఆ వివాహంలోని విషయం. ఇద్దరు స్వలింగ సంపర్కం చేసే స్త్రీలే. వారిద్దరూ భారతీయులే. అందుకే ఆది తొలి వివాహంగా నమోదైంది. అందులో ఒకరు అక్కడే జన్మించగా, మరోకరు భారత్ నుంచి అక్కడి వెళ్లి స్థిరపడిన వారు.

సరిగ్గా 2013లో జూలు పదిహేను ఈ వివాహం జరిగింది. సీమాను హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లికూతరుగా ముస్తాబు చేసి వారి కుటింబికులు తీసుకురాగా, షనాన్ క్రైస్తవ వధువుల వస్త్రాధారణతో వచ్చింది. వీరిద్దరి విహాహం హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగింది. ఈ పెళ్లికి వరుడే కరువయ్యాడు కానీ మిగతా అంతా యధావిధంగానే కొనసాగింది. వీరిద్దరి పెళ్లి ఫోటో అల్బమ్ ను వారి అనుమతితో పెళ్లికి ఫోటోలు తీసిన ఫోటోగ్రఫర్ స్టెప్ గ్రాంట్, నెట్ లో అప్ టోడ్ చేయడంతో ఇప్పుడది హల్ చల్ చేస్తోంది. అంతేకాదండి.. ఈ పెళ్లికి తాను ఫోటోలు తీయడం కూడా తన అదృష్టంగా బావిస్తున్నానని స్టెప్ గ్రాంట్ పేర్కోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : America's First Indian Lesbian Wedding  video goes viral  shannon and seema  

Other Articles