Tensions rise on china myanmar border

China, Myanmar border, jet, war, lu jenmin, unnan

CHINA sent fighter jets to its border with Myanmar and lodged a diplomatic protest after it said a Myanmar warplane dropped a bomb on Chinese territory, killing four people.

చైనా, మయన్మార్ ల మధ్య యుద్ద వాతావరణం

Posted: 03/16/2015 04:26 PM IST
Tensions rise on china myanmar border

మయన్మార్‌ సరిహద్దు చుట్టూ జెట్‌ ఫైటర్‌ యుద్ధ విమానాలను మొహరించింది చైనా. మయన్మార్‌ తో ఉద్రికత్త పరిస్ధితులు నెలకొన్న నేపధ్యంలో చైనా తాజాగా యుద్దానికి అన్ని ఏర్పాట్లకు సిద్దమైంది. చైనాలోని యున్నాన్‌ రాష్ట్రంలో మయన్మార్‌ యుద్ధ విమానం జారవిడిచిన బాంబులతో నలుగురు చైనా పౌరులు మరణించారు. ఈ విషయంపై తమ దేశంలోని మయన్మార్‌ రాయబారి తిట్‌ లిన్‌ ఓన్‌కు చైనా విదేశాంగ సహాయ మంత్రి లూ జెన్మిన్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మయన్మార్‌ యుద్ధ విమానం జారీ విడిచిన బాంబు చెరుకుతోటలో పడటంతో అక్కడ పని చేస్తున్న నలుగురు చైయనీలు మృతి చెందారు.

అలాగే గత వారంలో మయన్మార్‌ సైన్యం, ఒక స్థానిక తెగకు చెందిన సైన్యం దాడి చేయడంతో ఒక ఇళ్లు ధ్వంసంమయ్యిందని చైనా విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మయన్నార్‌ దాడిని లూ ఖండించారు. అలాగే, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపధ్యంలో మయన్మార్‌ సరిహద్దులో యుద్ధ విమానాలను మొహరించినట్లు చైనా మిలిటరీ ఆధికార ప్రతినిధి ప్రకటించారు. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన జెట్‌ ఫైటర్స్‌ దళాలను సరిహద్దులో మొహరించినట్లు ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం మయన్మార్, చైనా బోర్డర్ లో యుద్ద వాతావరణం తలెత్తింది. చైనా అనుకూల వర్గంపై మయన్మార్ చేస్తున్న అరాచకాలను అరికట్టాలని గతంలోనే చైనా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అలాగే మయన్మార్ గత కొంత కాలంగా సరిహద్దుల వద్ద కయ్యానికి కాలుదువ్వుతోందని చైనా ఆరోపిస్తోంది. మరి వాతవరణం ఇలానే కొనసాగితే యుద్దం తప్పని సరి అవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  Myanmar border  jet  war  lu jenmin  unnan  

Other Articles