Saddam hussein s tomb destroyed as battle for tikrit rages

Saddam Hussein's tomb destroyed, Saddams tomb destroyed as battle for Tikrit rages, Al-Awja Religious Compound in Tikrit, saddam tomb destroyed as Iraqi security forces drive out Isis, tomb of Iraq’s late dictator Saddam Hussein destroyed, clashes between Isis and Iraqi forces,

The tomb of Iraq’s late dictator Saddam Hussein was virtually levelled in heavy clashes between Isis militants and Iraqi forces in a fight for control of the city of Tikrit.

కూలిన సమాది.. కానరాని సద్దాం హుస్సేన్ ఆచూకీ..?

Posted: 03/16/2015 03:18 PM IST
Saddam hussein s tomb destroyed as battle for tikrit rages

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య జరుగుతున్న పోరుతో ఆసక్తికరం అంశంపై భయటపడింది. ఐఎస్ ఆక్రమిత టిక్రిట్ నగరంపై పట్టు సాధించేందుకు సైన్యం జరిపిన బాంబు దాడుల్లో ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ సమాధి ధ్వంసమైంది. 2006లో ఉరితీత తర్వాత సద్దాం పార్థివదేహాన్ని ఆయన సొంత గ్రామం.. టిక్రిట్ నగరానికి దక్షిణ ప్రాంతంలోఉన్న అల్ ఔజా గ్రామంలో ఖననం చేశారు. అనంతరం దానిని ఓ అద్భుత కట్టడంలా తీర్చిదిద్దారు.  ప్రస్తుతం ఇది పూర్తిగా నేలమట్టమైంది. ఇంతకీ ఆసక్తికర అంశం ఏంటనేగా మీ ప్రశ్న.. అదేనండీ.. నియంతృత్వ పాలనకు మారుపేరుగా నిలచి అగ్రరాజ్యాన్నే గడగడలాడించిన సద్దాం హుస్సేన్ పార్థీవ దేశం సమాదిలో లేదు..? మరేమయ్యింది..? ఎక్కడకెళ్లింది అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి

అసోసియేటెడ్ ప్రెస్ విడుదల చేసిన వీడియో ఫుటేజిలో ఔజా గ్రామంలోని సద్దాం సమాధి ఫిల్లర్లు నేలకూలిన దృశ్యాలు పొందుపర్చారు.  48 గంటల్లో టిక్రిట్ పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్నీ స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో నగరం రెండువైపుల నుంచి ఆదివారం ఇరాకీ సైన్యం చేసిన దాడులవల్లే ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. కాగా సమాధి విధ్వంసం గత ఆగస్టులోనే జరిగిందని ఐఎస్ వాదిస్తోంది. ఈ వాదనలను సైన్యం తోసిపుచ్చింది. కాగా, ఇలాంటి ఉపద్రవాన్ని ముందే ఊహించి టిక్రిట్లోని సమాధి నుంచి సద్దాం దేహాన్ని సురక్షితంగా వేరొక ప్రాంతానికి తరలించినట్లు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.

జీవ రసాయన ఆయుధాలు ఉన్నాయనే సాకుతో ఇరాక్పై యుద్దం చేసిన ఆమెరికా.. 2003లో సద్దాం హుస్సేన్ను బందీగా పట్టుకుంది. పెద్ద సంఖ్యలో షియా ముస్లింలు, కుర్దులను హత్యచేశారని ఆరోపిస్తూ ఇరాకీ ట్రిబ్యూనల్ 2006లో సద్దాంకు ఉరిశిక్షను ఖరారుచేసి, అమలుచేసింది. 2007 లో టిక్రిట్ పట్టణ శివార్లలోని ఓజా గ్రామంలోని సమాధిలో ఆయన దేహాన్ని ఖననం చేసిన విషయం తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saddam hussein  tomb destroyed  al-auja  tikrit  iraq  

Other Articles