Speaker s chair toppled mics flung as kerala finance minister presents budget

Speaker's chair toppled in kerala, mics flung as Kerala Finance Minister presents Budget, Kerala Finance Minister KM Mani, LDF activists and Yuva Morcha members protest in kerala, Activists converged around the Kerala Assembly Complex, Activists protest to prevent KM Mani from presenting the budget, LDF activists, Yuva Morcha members, Kerala Assembly, Kerala budget 2015-16,

Hundreds of LDF activists and Yuva Morcha members had converged around the Kerala Assembly Complex as part of a protest siege to prevent state Finance Minister KM Mani from presenting the budget on Friday.

దేవుడి సొంత రాష్ట్ర అసెంబ్లీలోనూ అదే తీరు..

Posted: 03/13/2015 01:20 PM IST
Speaker s chair toppled mics flung as kerala finance minister presents budget

ఏ రాష్ట్ర చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. అంతా ప్రజాప్రతినిధులే.. అయినా.. తప్పవు విమర్శలు, నిరసనలు అన్నట్లు.. దేశంలోని ప్రతి చోట అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కారణంగా వాదనలు, దూషణలు, మరికోన్ని చోట్ల అడుగు ముందుకేసి దౌర్జన్యాలు. వాళ్లంతా ప్రజల ఓట్లతో చట్టసభలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులే.. కానీ ఉనికి చాటుకునేందుకు ప్రతిపక్షాలు, అధికారంతో పాలక పక్షాలు వ్యవహరిస్తున్న తీరు సగటు మనిషిని ఆలోచింపజేస్తుంది.

అన్ని చోట్ల ఎలావున్నా.. దేవుడి సోంత రాష్ట్రంగా, ప్రకృతి పరవళ్లు తొక్కుతున్న కేరళలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇవాళ బడ్జెట్ సందర్భంగా కేరళ అసెంబ్లీ ఎదుట విఫక్ష ఎల్ డీ ఎఫ్ కు చెందిన కార్యకర్తలు, యువమోర్చా సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆర్థిక మంత్రి కె ఎం మణి చేత బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నవారు పెద్ద సంఖ్యలో అసెంబ్లీకి చేరుకుని నిరసనకు దిగారు. ప్రతిపక్షాల వ్యూహాన్ని కనిపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి మణి మార్షల్స్ పహరా నడుమ బడ్జెట్ ప్రసంగాన్ని చదివి మమ అనిపించారు.

కాగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం సాగినంత సేపు అసభ్య దృశ్యాలు కనిపించాయి. స్పీకర్ చైర్ పైనా విపక్ష సభ్యులు తమ ప్రతాపాన్ని చూపారు. కొద్ది సేపు చైర్ అటుఇటు ఊపారు. అది చాలదన్నట్లు పలువురు ప్రతిపక్ష సభ్యలు మైకులు విసిరారు. ఈ ఘటనలను చూసి ఓ శాసనసభ్యడు అసెంబ్లీ జరుగుతుండగానే సృహ కోల్పోయాడు. ఇన్ని నిరసనలు, ఆందోళనలు కోనసాగుతున్నా ఆర్థిక మంత్రి మాత్రం తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు. అసెంబ్లీలోని శాసనసభ్యులను వెళ్లనీయకుండా యువమోర్చా కార్యకర్తలు, ఎల్డీఎఫ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. స్పీకర్ సాకేతన్ ను కూడా అనుమతించలేదు. దీంతో అసెంబ్లో ఆవరణలోనే ముందగా ఆందోళనకు దారి తీసింది. పలువరు ఎల్డీఎప్ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద కూర్చోని ఇన్ క్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

ఇదంతా చూసిన ప్రజలు అసెంబ్లీకి వెళ్లిన శాసనసభ్యులు ఏం చేస్తున్నారు..? బడ్జెట్ లో తమకు చేకూరుతున్న లబ్ది ఏంటి అన్న విషయాలను మర్చి.. ఔరా.. వీళ్లకేనా మనం భారీ క్యూ లో నిలబడి ఓట్ల వేసి గెలిపించిందని. అనుకునే స్థాయికి చేరింది. అయితే ఈ పరిస్థితిని మార్చడం ఎప్పటికి సాధ్యపడుతుందో కానీ.. నిరసనకారులు కూడా శృతిమించకుండా చర్యలు తీసుకోవడంలో అక్కడి ప్రభుత్వం కూడా విఫలం చెందింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala Assembly  KM Mani  LDF activists and Yuva Morcha  

Other Articles