Smart andhra pradesh for better standard of living

smart andhra pradesh for better standard of living, Yanamala allocates 33,252 acres, Rs. 3168 crores for new capital, Yanamala Ramakrishnudu tables first year long budget, Yanamala first year long budget, AndhraPradesh budget 2015-16, Andhra Pradesh finance minister Yanamala Ramakrishnudu, AndhraPradesh budget, AndhraPradesh Assembly, AndhraPradesh CM chandrababu Naidu

smart andhra pradesh for better standard of living

ప్రజల జీవన ప్రమాణాలను పెంచే.. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్

Posted: 03/12/2015 04:08 PM IST
Smart andhra pradesh for better standard of living

గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం రూపొందించిందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తూ.. జనవరి 18, 2015న స్మార్ట్ గ్రామం, స్మార్ట్ వార్డు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. తొలిదశలో 20 అభివృద్ధి సూచికలపై దృష్టిపెడతామని చెప్పారు. నిర్దిష్ట కాలవ్యవధిలో గ్రామాల్లో, వార్డుల్లో సమగ్ర అభివృద్ధి సాధించడం ఈ పథకం లక్ష్యంగా పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని సత్వరమే అభివృద్ధి చేయడం కోసం వివిధ కార్యక్రమాల మధ్య సమన్వయం సాధించడం కోసం ఒక ప్రాధికార సంస్థగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు యనమల తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా రాష్ట్రాన్ని రూపొందించడానికి వీలుగా, దీర్ఘకాల ఆస్తుల మీద పెట్టుబడులు పెట్టడం కోసం అదనపు వనరులను సమీకరించడం కోసం ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అభివృద్ధిలో భాగస్వాములైన అన్ని ప్రభుత్వ శాఖల తరపున ఈ బోర్డు ఇన్వెస్ట్‌మెంట్ ఫెసిలిటేషన్ ఫండ్‌ను, ప్రాజెక్టు డెవలెంప్‌మెంట్ ఫండ్‌ను, వయబులిటీ గ్యాప్ ఫండ్‌ను నిర్వహిస్తుందని యనమల వివరించారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జన్మభూమి-మా వూరు' కార్యక్రమానికి అధిక ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. తొలివిడత జన్మభూమిలో సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం ప్రతి గ్రామం, మున్సిపాలిటీలో కీలక రంగాలపై దృష్టిసారిస్తూ సూక్ష్మ ప్రణాళిక రూపొందిస్తుందని చెప్పారు. దీంట్లో భాగంగా చేపట్టబోయే పనులు.. ప్రాథమిక రంగం, సామాజిక సాధికారికత, విజ్ఞాన నైపుణ్యాభివృద్ధి మిషన్లు ఆశిస్తున్న లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయని యనమల పేర్కొన్నారు.
 

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP budget 2015-16  AndhraPradesh Assembly  Yanamala Ramakrishnudu  

Other Articles