Ap financial minister yanamala ramakrishnudu will submitt budget at assembly today

andhrapradesh, ap, budget, yanamala, chandrababu

ap financial minister yanamala ramakrishnudu will submitt budget at assembly today. ap suffering for funds. the central govt didnt release expected amount to the newly bifericated state andhrapradesh.

లక్షా 13 వేల కోట్లతో ఏపి బడ్జెట్

Posted: 03/12/2015 09:47 AM IST
Ap financial minister yanamala ramakrishnudu will submitt budget at assembly today

2015-16 ఆర్థిక సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో మంత్రి నారాయణ బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతారు. ఈ సారి కేంద్రం నుంచి పెద్దఎత్తున నిధులు వస్తాయనే ఆశతో కాకుండా.. కొంతవరకు వాస్తవ దృష్టితో యనమల బడ్జెట్ కు మెరుగులు దిద్దారు. బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. సుమారు రూ.7,300 కోట్ల రెవెన్యూ లోటుతో.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.1,13,100 కోట్ల బడ్జెట్‌ను రూపొందించినట్లు సమాచారం. ఇందులో ప్రణాళిక వ్యయం కింద రూ.34,450 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.78,650 కోట్లు ప్రతిపాదించారు. ద్రవ్యలోటు రూ.17,500 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.45 వేల కోట్లుంటుందని, పన్నేతర ఆదాయం రూ.9,900 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రూ.22,600 కోట్లు, రెవెన్యూ లోటు రూపంలో రూ.6,600 కోట్లు వస్తాయని అంచనా వేశారు.

ఈసారి బడ్జెట్‌లో కూడా వార్షిక ప్రణాళికను పెద్దగా పెంచలేదు. వార్షిక ప్రణాళికను పెంచితే ఆ మేరకు ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలకు పెద్ద ఎత్తున నిధుల కేటాయింపులు చేయాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వార్షిక ప్రణాళికను రూ.34,450 కోట్లకు పరిమితం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. బీసీ సంక్షేమానికి కేటాయించే నిధులను నూటికి నూరు శాతంతో పాటు మిగతా 19 రంగాలకు చెందిన నిధుల్లో 25 శాతం నిధులను కలిపి బీసీ ఉప ప్రణాళికను రూపొందించారు. బీసీ విద్యార్థులకు ఫీజు రీయిం బర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల నిధులు కూడా బీసీ ఉప ప్రణాళికలో కలిపేశారు. బీసీ ఉప ప్రణాళిక కింద రూ.6,600 కోట్లు కేటాయించారు. మరో పక్క ఆసుపత్రులతో సహా రవాణా, స్టాంపులు.. రిజిస్ట్రేషన్లు తదితర అన్ని విభాగాల్లో యూజర్ చార్జీలను పునరుద్ధరిస్తున్నారు. బడ్జెట్ ముందస్తు సమావేశాల్లోనే ఈ చార్జీలనూ ఆదాయ రంగాల్లో కలిపేసి చూపించాలని శాఖలకు స్పష్టం చేశారు. రాష్ట్ర సొంత పన్ను ఆదా యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కన్నా రూ.10,000 కోట్లు అదనంగా వస్తుందని.. రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.5.86 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

మొత్తానికి కొత్త రాష్ట్రానికి సరి కొత్త సవాళ్ల నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ ఎంతో కీలకంగా మారింది. పూర్తిగా కేంద్ర నిధుల కోసం ఎదురు చూస్తున్న ఏపి ప్రభుత్వానికి నిరాశే ఎదురవుతోంది. కాగా గత కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వానికి మరింత ఆర్థిక భారాన్ని పెంచింది. ఉద్యోగులకు పిఆర్సీతో పాటు, రాజధాని నిర్మాణానికి భారీగా పెరిగిన వ్యయాలతో ఏపి ఆర్థికంగా గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది. అయితే 2015-16 సంవత్సరానికి గాను ప్రభుత్వం తీసుకు రానున్న బడ్జెట్ పై ఏపి భవిష్యత్ ఆధారపడనుంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhrapradesh  ap  budget  yanamala  chandrababu  

Other Articles