Justice markandey katju described mahatma gandhi as a british agent

Press Council Chairman, Justice Markandey Katju, gandhi, britesh agent, blog,

Press Council Chairman Justice Markandey Katju has sparked another row by describing Mahatma Gandhi as a British agent in his latest blog post. He said Gandhi did great harm to India by injecting religion into politics.

విభజించు పాలించు సిద్దాంతాన్ని పాటించిన గాంధీ!

Posted: 03/10/2015 03:28 PM IST
Justice markandey katju described mahatma gandhi as a british agent

జస్టిస్ మార్కండేయ ఖట్జూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. "భారతదేశానికి హాని చేసిన జాతిపిత మహత్మా గాంధీ- ఓ బ్రిటిష్ ఏజెంట్" అంటూ తన బ్లాగ్ లో ఓ ఆర్టికల్ రాసి, పోస్ట్ చేశారు. అసలు గాంధీని తాను ఎందుకు అలా అనవలసి వచ్చిందో తన ఆర్టికల్ లో వివరించారు. మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ బ్రిటీష్ వారు పాటించిన విభజించు పాలించు అనే సిద్దాంతాన్ని పాటించారని అన్నారు. అలాగే గాంధీ మతతత్వం కనిపించేలా, ఉద్యమాన్ని మలుచుకున్నారని అన్నారు. హిందుత్వ భావాలు ఉట్టి పడే పేర్లను తన ఉద్యమంలో వాడుకున్నారని తెలిపారు. అయితే మార్కండేయ ఖట్జూ రాసిన వ్యాసం తీవ్ర సంచలనం రేపింది. సర్వత్రా నిరసర వెల్లువ కొనసాగుతోంది. అయితే కొందరు మాత్రం దాన్ని సమర్థిస్తున్నారు.

భారతదేశంలో అద్భుతమైన వైవిధ్యం ఉందని, కులాలు, మతాలు, జాతులు, భాషలు ఉన్నాయని చెప్పారు. విభజించు పాలించు అనేది బ్రిటిష్ విధానం అందరికీ తెలుసునని, తర్వాత కాలంలో అదే బ్రిటిష్ విధానాన్ని మహాత్మా గాంధీ మరింతగా విస్తరించారని ఆరోపించారు. 'వాట్ ఈజ్ ఇండియా' పేరుతో రాసిన ఓ అర్టికల్‌లో గాంధీజీపై కట్జూ తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేశారు. "ఇలా అనడం వల్ల నాపై వ్యక్తిగత దూషణలు వస్తాయని నాకు తెలుసు. కానీ ప్రజాదరణ ఆశించని ఓ వ్యక్తిని కాదు కాబట్టి పెద్ద విషయం కాదు. అని వివరించారు.  

katjublog
ఇలాంటి వాటి వల్ల మొదట్లో నన్ను అప్రజాదరణకు గురిచేస్తాయి. దాంతో నేను అవమానాలు పడాల్సి ఉంటుంది, పలువురు నా వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తారు. నా దేశం ఆసక్తి మేరకు కొన్ని విషయాలు చెబుతున్నాను" అని కట్జూ ముందుగానే పేర్కొన్నారు. మొత్తానికి ఆర్టికల్ తరువాత వచ్చే పలు విమర్శలను కూడా ఖట్జూ ముందే ప్రస్తావించారు. అయితే వెంటనే బ్లాగ్ ను నిలిపివెయ్యాలని గాంధేయవాదులు కోరుతున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Press Council Chairman  Justice Markandey Katju  gandhi  britesh agent  blog  

Other Articles