Cisf helping hand to the people who suffering with several problems

cisf, modi, delhi, metro, 46th Raising Day,

Prime Minister Narendra Modi on Tuesday saluted the "bravery" and "sense of duty" of CISF personnel on force's 46th Raising Day. cisf saves 180 lives in last one year.

భద్రతా దళం ఇస్తోంది ఆపన్న హస్తం

Posted: 03/10/2015 01:37 PM IST
Cisf helping hand to the people who suffering with several problems

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 180 ఆత్మహత్యల్ని అడ్డుకున్నారు. ఎప్పుడై కర్షకంగా వ్యవహరించే వారు ఎంతో మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఇంతకీ ఎవరి గురించి ఈ ఉపోద్ఘాతమంతా అనుకుంటున్నారా..సిఐఎస్ఎఫ్ గురించి.  ఒకచేత్తో లాఠీ, మరో చేతిలో అధునాతన ఆయుధం. ఆందోళనలను కట్టడి చేసే సీఐఎస్ఎఫ్ ఇప్పుడు ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తోంది.  గడిచిన ఏడాది కాలంగా దేశ రాజధాని ఢిల్లీ మెట్రో రైల్వే  ట్రాక్ లపై ఆత్మహత్యలకు ప్రయత్నించిన 180 మందిని కాపాడి అందరి మన్ననలను పొందుతోంది.

twittercisf

ఎయిర్ పోర్టుల తర్వాత బంగారం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా  మెట్రో రైళ్లలోనే జరుగుతోంది. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో రైల్ స్టేషన్ల వద్ద రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ మెట్రో రైల్లో సీఐఎస్ఎఫ్ పలు నేరాల్ని అడ్డుకుంది. దాదాపు 10 వేల మంది పురుషుల్ని మహిళల కోచ్ ల నుంచి దింపేశారు. 6 ఆయుధాలు, 120 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకుంది.  10.8 కోట్ల అక్రమ ధనాన్ని గుర్తించింది.  382 మంది జేబు దొంగల్ని అరెస్టు చేశారు సిఐఎస్ఎఫ్ పోలీసులు. ఇలా సీఐఎస్ఎఫ్ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. 46 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కూడా  సీఐఎస్ఎఫ్ ను అభినందించారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cisf  modi  delhi  metro  46th Raising Day  

Other Articles