Ap assembly sessions started today and dismissed for ten minutes

ap, assembly, jagan, ysrcongress, farmers, speaker

ap assembly sessions started today and dismissed for ten minutes. opposition ysr congress party of ap, tried to the discussion bill about farmers, but speaker reject that. the ysrcongress mlas oppose that.

ఏపి అసెంబ్లీ ప్రారంభం.. పది నిమిషాలు వాయిదా

Posted: 03/09/2015 10:37 AM IST
Ap assembly sessions started today and dismissed for ten minutes

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండోరోజు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. అయితే వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంతో సభలో కాస్త గందరగోళ వాతావరణం నెలకొంది. రైతు సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, కరవు సమస్యలపై చర్చకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. కాగా సభ సజావుగా జరిగేందుకు సభ్యులు సహకరించాలని స్పీకర్ పలు సార్లు విజ్ఞప్తి చేశారు. అయినా పరిస్థితి మారకపోవడంతో సభ పది నిమిషాలు వాయిదా పడింది.

రాష్ట్రంలో రైతుల సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టవా అంటూ శాసనసభా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అయితే ప్రతిపక్షనేత జగన్ మాట్లాడేప్పుడు మైక్ కట్ చెయ్యడంతో సభ వేడెక్కింది. సమస్యలపై చర్చలకు ప్రభుత్వం వెనకాడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై మాటల యుద్దానికి దిగారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటూ మైక్ కట్ చేయటం సమంజసమేనా అని వైఎస్ జగన్ స్పీకర్ ను ప్రశ్నించారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  assembly  jagan  ysrcongress  farmers  speaker  

Other Articles